Viral Video : ప్రజలను రక్షించాల్సిన పోలీసులే చాలా సార్లు పబ్లిక్ ను ఇబ్బందులు పెడుతున్నారని వార్తలు రావడం చూశాం. సామాన్యులతో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించిన ఘటనలు చాలా చూశాం. గతంలో ఇలాంటివి చాలానే ఉన్నాయి. కానీ .. కొన్ని సందర్భాల్లో పోలీసులతో కూడా కొందరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులపై చేయెత్తి కొట్టడం, వారిని అసభ్యకరంగా తిట్టడం.. ఇలాంటివి కూడా తరచూ జరుగుతున్నాయి. ఇలాంటిదే ఒక వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ అయింది.

ఒక పోలీసును యువతి ఒంటి కాలితో తన్నేందుకు యత్నించింది. కాలర్ పట్టుకుని ఆ ఖాకీపై పెద్దపెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ నానా రచ్చ చేసింది. ఆ యువతి మద్యం మత్తులో అలా ప్రవర్తించిందో లేక ఉద్దేశపూర్వకంగానే ఆ పోలీసుతో అలా ప్రవర్తించిందో తెలియాల్సి ఉంది.
కేరళలో ఒక పోలీసుపై ఒక వ్యక్తి కత్తితో దాడికి ప్రయత్నించిన ఘటన మరువక ముందే తాజాగా మరో వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు కానీ జరిగిన ఘటన మాత్రం ఆ వీడియో చూసిన నెటిజన్లకు షాకింగ్ గా అనిపించింది.
ఆ వీడియోలో ఆ యువతి .. ఆమె కన్నా ఎంతో ఎత్తుగా ఉన్న పోలీసు అధికారిని గట్టిగా పట్టుకుంది. దగ్గరగా వెళ్లి ఏదో మాట్లాడుతుంది. ఆ సమయంలో పోలీసు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆ యువతి పోలీసు తలపై పట్టుకోబోయింది. తర్వాత కాలుపైకెత్తి ఎగిరి తన్నబోయింది.ఆమె కాలు ఎత్తగానే పోలీసు తప్పుకున్నాడు.వేలు చూపిస్తూ కేకలు వేస్తూ పోలీసు దగ్గరికి వెళ్లింది. తర్వాత అతని ముఖం మీద పట్టుకోబోతే మాస్క్ చేతికి దొరికింది.
- Advertisement -
ఈ వీడియోలో యువతి పోలీసు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వైరల్ అయింది. ఆమె మద్యం మత్తులో ఇలా ప్రవర్తించి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.
एक और परी की Video Viral है।
देखिए कैसे एक पुलिस अधिकारी की वर्दी का कॉलर पकड़ कर खड़ी है और पुलिस वाला बेबस है।
क्योंकि जानता है गलती से अगर उसने लड़की को ही हाथ लगा दिया तो क़ानून उसको ही नाप देगा। pic.twitter.com/5AHtj3E2A7
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) June 19, 2022