కరోనా భయంతో రైలు కింద పడి రైతు మృతి

Advertisement

గుంటూరు: కరోనా వచ్చి చాలామంది చనిపోతున్నారు. కానీ కొంతమంది తమకు కరోనా వచ్చిందేమోననే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల మండలం అప్పిగట్లకు చెందిన రైతు ఇనగంటి ధనుంజయ (72) చిన్న కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం చిన్న కుమారుడు కరోనా బారిన పడి తెనాలి కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చిన ధనుంజయ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆయన కోసం వెతకడం ప్రారంభించారు.

అయితే పట్టణంలోని బృందావనం కాలనీలోని రైలు పట్టాల దగ్గర ఒక వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృత దేహం తన తండ్రిదేనని పెద్ద కుమారుడు ధనుంజయ గుర్తించారు. అనుమానం వచ్చిన వైద్యులు మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహియించగా పాజిటివ్ అని తేలింది. కరోనా మృత దేహాలను దహనం చేసే విధానంలోనే అంత్యక్రియలు చేస్తామని అధికారులు తెలిపారు. కరోనా భయం వల్లే చనిపోయి ఉంటాడని స్థానికులు చెప్తున్నా… పోలీసులు మాత్రం కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here