Dimple Hayathi Emotional Comments : నల్లగా ఉన్నావంటూ అవమానించాడు.. డైరెక్టర్ పై డింపుల్ హయతీ ఫైర్..!
NQ Staff - June 26, 2023 / 01:32 PM IST

Dimple Hayathi Emotional Comments : ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచంగా మారిపోయింది. ఇక్కడ హీరోయిన్లుగా రాణించాలంటే ట్యాలెంట్ కంటే అందం ఎక్కువగా ఉండాలి. వీలైనంతగా అందాలను ఆరబోయాలి. ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తే అంత పెద్ద సినిమాలో ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ అయిపోయింది.
కాగా కొందరు మాత్రం పెద్దగా అందంగా లేకపోయినా రాణిస్తున్నారు. అలాంటి వారికి అవమానాలు కూడా బాగానే జరుగుతున్నాయి. తాజాగా డింపుల్ హయతీ కూడా ఎమోషనల్ కామెంట్లు చేసింది. నేను మోడలింగ్ చేస్తున్న సమయంలోనే కోలీవుడ్ లో ఓ సినిమా ఆడిషన్స్ కు వెళ్లాను.
అందులో హీరోయిన్ రోల్ కోసం నన్ను నిర్మాత సెలెక్ట్ చేశారు. కానీ డైరెక్టర్ కూడా నన్ను ఆడిషన్ చేస్తానని తన ఆఫీస్ కు పిలిచాడు. సరే అని వెళ్లాను. అక్కడ నన్ను చూసి నువ్వు నల్లగా ఉన్నావ్.. హీరోయిన్ గా సెట్ కావు అంటూ దారుణంగా మాట్లాడాడు. దాంతో చాలా బాధగా అనిపించింది.
ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత నాలో నేను బాధపడ్డాను. తర్వాత తేరుకుని.. నా మీద నాకు ఉన్న విశ్వాసంతోనే ముందుకు వచ్చాను. తెలుగులో ఇప్పుడు నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఎలాగైనా స్టార్ అయి ఆ డైరెక్టర్ కు బుద్ధి చెప్పాలని ఉంది అంటూ తెలిపింది డింపుల్.