China : వివాహేతర సంబంధాలు ఉన్న వారిని ఉద్యోగం నుండి ఔట్‌

NQ Staff - June 17, 2023 / 07:18 PM IST

China : వివాహేతర సంబంధాలు ఉన్న వారిని ఉద్యోగం నుండి ఔట్‌

China  : చైనాలో కంపెనీలు చిత్ర విచిత్రమైన కండీషన్స్ పెడుతూ ఉంటుంది. ఉద్యోగుల వ్యక్తిగత విషయాల గురించి కూడా కంపెనీలు శ్రద్ద తీసుకోవడం మనం చైనా కంపెనీల్లో మాత్రమే చూస్తాం. ఎన్నో చైనా కంపెనీలు తమ ఉద్యోగస్తుల నుండి ఎంతగా పని చేయించుకుంటాయో అంతకు రెట్టింపు చెల్లిస్తాయి అనే టాక్ ఉంది.

కొన్ని కంపెనీలు మాత్రం శ్రమ దోపిడి చేస్తాయి. ఇలాంటి పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కూడా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు చైనా లోని జెజియాంగ్ నగరంలోని ఒక కంపెనీ తమ ఉద్యోగస్తులు వివాహేతర సంబంధాలు కలిగి ఉండవద్దు అంటూ కఠినంగా వ్యవహరిస్తోంది.

కంపెనీ కోసం ఉద్యోగస్తులు విదేయతో పని చేయాలనే ఉద్దేశ్యంతో అక్రమ సంబంధాలు ఉన్న వారిని కంపెనీ నుండి తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. అంతే కాకుండా భార్య భర్త మధ్య సన్నిహిత్య సంబంధాలు ఉండాలి అని కంపెనీ భావిస్తుంది.

అక్రమ సంబంధాలు ఉండటం.. భార్య భర్తల మధ్య గొడవలు ఉండటం వల్ల పని సరిగా చేయలేరు అనే ఉద్దేశ్యంతో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తమ కంపెనీలో చేస్తున్న వారు ఎవరైనా కూడా అక్రమ సంబంధం ను కలిగి ఉన్నారు అని తెలిస్తే వెంటనే నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగం నుండి తొలగిస్తామని కంపెనీ హెచ్చరించింది. ఇప్పటికే కొంత మందిని ఆ కారణంతో ఫైర్ చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us