Marriage : బుల్లెట్టు బండి బలాదూర్.! కేరళ నవ వధువు కొత్త రికార్డ్.!

NQ Staff - December 28, 2022 / 08:24 AM IST

Marriage : బుల్లెట్టు బండి బలాదూర్.! కేరళ నవ వధువు కొత్త రికార్డ్.!

Marriage : ‘బుల్లెట్టు బండి’ పాట గుర్తుంది కదా.? నిజానికి, ఆ పాట వైరల్ అయ్యింది.. ఓ పెళ్ళి వేడుక వల్ల. ఓ నవ వధువు ఆ పాటకి డాన్సులేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలా ఆ పాట వైరల్ అయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్టు బండి పాట తెలియనివారెవరూ వుండరంటే అది అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు ఆ బుల్లెట్టు బండి తాలూకు వీడియోని మించిపోయింది ఇంకో వీడియో. చెందా అనే సంగీత వాయిద్యం వాయిస్తూ ఓ నవ వధువు చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

చెందా.. చితక్కొట్టేసిందంతే..

ఓ యువతి సంగీత వాయిద్యాన్ని వాయించేస్తోంటే.. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. కేరళలో జరిిందీ ఘటన. పెళ్ళి వేదిక వద్దనే వధువు, చెందా అనే సంగీత వాయిద్యాన్ని లయబద్ధంగా వాయించింది. అంతేనా, తన్మయత్వంతో ఊగిపోయి.. ఓ మోస్తరుగా డాన్స్ కూడా చేసింది.

వధువు తండ్రి చెందాయ్ మాస్టర్ కావడం గమనార్హం. ఆయన కూడా తన కుమార్తెతో కలిసి సంబరాల్లో మునిగిపోయాడు. ఓ నెటిజన్ ఈ మొత్తం తతంగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
నవ వధువు ఎనర్జీ, ఆమెకు ఈ వాయిద్యం పట్ల వున్న అవగాహన.. వీటి గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us