Crime News : ప్రియురాల్ని కసితో చావబాదిన ప్రియుడు: బాధితురాలి పరిస్థితి విషమం.. వీడియో వైరల్
NQ Staff - December 25, 2022 / 01:46 PM IST

Crime News : ఓ ప్రియుడు తన ప్రియురాల్ని చావబాదాడు. జనం ఎవరూ లేని చోటకు ప్రియురాల్ని తీసుకెళ్ళి అత్యంత కిరాతకంగా ఆమెపై దాడి చేశాడు. దాడి చేసేందుకు తన చేతుల్ని, కాళ్ళనే ఆయుధాలుగా వాడాడా కిరాతక ప్రేమికుడు.
వివాదం ఎలా మొదలైందో తెలియదుగానీ, మాట్లాడుతుండగానే హఠాత్తుగా రాక్షకుడైపోయాడు ఆ యువకుడు. తన వెంట వచ్చిన ప్రియురాలిపై దారుణమైన రీతిలో దాడి చేశాడు.
కింద పడేసి.. కాళ్ళతో తొక్కేసి..
ప్రియురాల్ని కొట్టి కింద పడేసి, కసి తీరక.. కాళ్ళతో తొక్కేశాడు. దాదాపుగా ఆమె చనిపోయే పరిస్థితి వచ్చింది. అచేతనంగా పడి వున్న బాధితురాల్ని కొందరు ఆసుపత్రికి తరలించారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో వీడియో తీసినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు వీడియో ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. నిందితుడు ఎందుకు దాడి చేశాడనేది తెలియాల్సి వుంది. బాధితురాలి పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది.
Sources::PAINFUL..SHAMEFUL..BEYOND the limits of Inhumanity..
Madhya Pradesh:The lover made his Girlfriend half-dead by beating her on the deserted road of the village. The local people who reached the spot rescued the girl from the youth.The police registered case under 151 pic.twitter.com/8NrOXglnRN— Sravani Journalist (@sravanijourno) December 25, 2022