Pencil Missing : పెన్సిల్ పోయింద‌ని ఫ్రెండ్ మీద పోలీస్ స్టేష‌న్‌లో కంప్లైంట్ చేసిన బుడ్డోడు

Pencil Missing : కర్నూలు జిల్లాలో బుడతలు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. స్కూల్‌ బ్యాగ్‌లోనుంచి స్నేహితుడు పెన్సిల్‌ను అపహరించాడంటూ…ఫిర్యాదు కోసం ఏకాంగా పోలీస్‌స్టేషన్‌ వెళ్లటం అందర్ని ఆశ్చర్యపర్చింది. జిల్లాలోని పెద్దకడుబూర్‌ పోలీసులను చిన్నారులు కలిసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇది చూసి అంద‌రు న‌వ్వుకుంటున్నారు.

a boy filed police case about pencil missing
a boy filed police case about pencil missing

వివరాల‌లోకి వెళితే స్నేహితుడు పెన్సిల్ దొంగిలించాడంటూ ఓ పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. హోం వ‌ర్క్ చేసుకుంటుంటే మ‌రో బాలుడు త‌న పెన్సిల్ ఎత్తుకెళ్లాడ‌ని ఫిర్యాదు చేశాడు. హ‌న్మంత్ అనే విద్యార్థి పెన్సిల్‌ను మ‌రో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హ‌న్మంత్ స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి పెన్సిల్ దొంగ‌త‌నంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

ప్ర‌తి రోజు పెన్సిల్స్ దొంగ‌త‌నం చేస్తున్నాడు. పైస‌లు కూడా తీసుకుపోతున్నాడు. రోజు ఇదే ప‌ని అని హ‌న్మంత్ పోలీసుల‌కు చెప్పాడు. ఈ ఒక్క‌సారి కేసు పెట్టండి అని కోరాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయిపోయింది. సార్ పెన్సిల్ తిరిగి ఇచ్చాను అని మ‌రో అబ్బాయి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అయినా హ‌న్మంత్ మాత్రం విన‌లేదు. ఇదొక్క‌సారి కేసు పెట్టండి సార్ అని పోలీసుల‌ను అడిగాడు.

ఇద్ద‌రు పిల్ల‌ల‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా హన్మంత్ మాత్రం వినలేదు. కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. బెయిల్ ఇవ్వడం.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇబ్బంది అవుతుందని స్టేషన్ ఇంచార్జీ చెప్పినా పట్టించుకోలేదు. అప్పటివరకు ఊ అని తల ఊపాడు. తర్వాత కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. వద్దు కేసు ఎందుకు.. వదిలేయు.. బెయిల్ రావడం కష్టం అని చెప్పిన వినలేదు. అతని తీరుతో పోలీసులు స‌ర‌దాగా న‌వ్వుకున్నారు.

ఈ సారికి వద్దు హన్మంత్ అంటూ సర్ది చెప్పారు. ఇద్ద‌రూ బాగా చదువుకోవాల‌ని పోలీసులు సూచించారు.ప్ర‌స్తుతం బుడ్డోడి వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది.