టాయ్‌లెట్‌కి వెళ్లిన స‌మ‌యంలో పాము కాటుకు గురైన 65 ఏళ్ల వ్య‌క్తి

పాము పేరు వింటేనే చాలా మంది గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంటారు. మ‌న ప‌క్క‌నే పాము ఉంటే ఇంక ప‌రిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఆస్ట్రియా దేశంలో ఓ వ్య‌క్తి టాయ్‌లెట్‌కి వెళ్లగా, అక్క‌డ చాటున ఉన్న పాము 65 ఏళ్ల వ్య‌క్తిని కాటేసింది. ప్ర‌స్తుతం ఆ యువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

వివ‌రాల‌లోకి వెళితే టాయిలెట్ సీటు మీద కూర్చున్న వ్యక్తిని.. ఏకంగా మర్మాంగం మీద కరిచింది అనకొండ‌. ఈ దారుణ సంఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. తెల్ల‌వారుఝామున ఇంట్లోని టాయిలెట్‌లోకి వెళ్లిన వ్యక్తి టాయిలెట్ సీట్ మీద కూర్చున్నాడు.అప్ప‌టికే అక్క‌డ దాగి ఉన్న అనకొండ ఆ వ్య‌క్తి మ‌ర్మాంగం మీద కాటేసింది. అనుమానంతోనే ఆవ్య‌క్తి ఉండ‌గా, తేరుకునే లోపే ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

వ్య‌క్తి మ‌ర్మాంగంపై పాము కాటు వేయ‌డంతో వ్య‌క్తి ప‌రిస్థితి విష‌మంగా మారింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టగా ఆ పాము పక్కింట్లో నుంచి వచ్చిందని తేలింది. వెంటనే పక్కింటికి వెళ్లి విచారించిన పోలీసులు.. ఆ ఇంట్లోని 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.

24 ఏళ్ల వ్య‌క్తి త‌న ఇంట్లో 11 పాములు పెంచుతున్నాడ‌ట‌. ఇందులోని ఒక పాము డ్రైనేజి గుండా టాయిలెట్ లోకి వ‌చ్చేసింద‌ట‌. అలా టాయిలెట్‌లోకి వ‌చ్చిన పాము వ్య‌క్తిని కాటేసింది. విదేశాల్లో పాములను కుక్కలు పిల్లుల మాదిరిగా పెంచుతుంటారు. అలా ఓ యువకుడు పాముని పెంచి.. ఈ పరిస్థితి కారణమయ్యాడు. అతన్ని అరెస్టుచేసిన పోలీసులు.. ఆ పాములను అడవుల్లో వదిలేసేందుకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.