ఏపీ లో శానిటైజర్ తాగి 8 మంది మృతి

Advertisement

ఏపీ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. అయితే తాజాగా ప్రతిరోజు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా భారిన పడి చాలా మంది మరణిస్తున్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా కొందరు మందుబాబులు శానిటైజర్ తాగి ప్రాణాలను కోల్పోయారు.

వివరాల్లోకి వెళితే ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలోని కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర కొందరు యాచకులు మద్యానికి బానిస అయ్యారు. ఇటీవల కాలంలో ఏపీ సర్కార్ మద్యం అమ్మకాలను తగ్గించింది. అలాగే మద్యం రేట్లను కూడా పెంచింది. దీనితో నాటు సారాకు అలవాటు పడ్డారు. సారా కూడా దొరకని పరిస్థితిలో యాచకులు శానిటైజర్ తాగుతున్నారు. ఇలా శానిటైజర్ తాగి ఎనమిది మంది చనిపోయారు అని పోలీసులు వివరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here