5G Network : రూ.10 వేల 5G ఫోన్ వచ్చేసిందోచ్
NQ Staff - December 17, 2022 / 04:54 PM IST

5G Network : ప్రపంచ వ్యాప్తంగా అతి త్వరలోనే 5G నెట్వర్క్ అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే పలు దేశాల్లో 5G సేవలు ప్రారంభం అయ్యాయి. మన దేశంలో కూడా ప్రారంభిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
ఇండియాలోని ప్రధాన నగరాల్లో 5G సేవలు అందుబాటులో ఉండగా అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా 5G అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మార్కెట్లోకి కొత్త 5G మొబైల్స్ వస్తున్నాయి.
ప్రతి కంపెనీ కూడా 5G మొబైల్స్ తయారు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇండియాలో అత్యంత చౌకైనా 5G ఫోన్ గా మోటరోలా కంపెనీ తయారు చేసిన మోటో G52 నిలిచింది.
6.5 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ లో 8 జిబి రామ్, 128జిబి స్టోరేజ్. డ్యూయల్ కెమెరా సెట్.. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇంకా అత్యాధునిక ఫీచర్స్ ఉన్నట్లుగా కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం చైనాలో ఉన్న ఈ ఫోన్ అతి త్వరలోనే ఇండియామార్కెట్లో అందుబాటులోకి రాబోతుంది.