Breaking : కరోనా సెకండ్ వేవ్… తమిళనాడు థియేటర్లలో 50 శాతమే ఆక్యుపెన్సీ

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర తర్వాత కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

50 percent occupancy only in theaters in tamilnadu due to covid rise
50 percent occupancy only in theaters in tamilnadu due to covid rise

కరోనా ఎక్కువగా వ్యాప్తం చెందుతుంది.. అని అనుకునే వాటిపై వెంటనే నిషేధాలు విధిస్తోంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే థియేటర్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ కాకుండా… కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లను నడపాలని ఆదేశాలు జారీ చేసింది.

గత సంవత్సరం కూడా కరోనా వల్ల పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు మూత పడ్డాయి. తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత కరోనా తగ్గడంతో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది.

అయితే… ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement