కొత్త సచివాలయానికి 400 కోట్ల నిధులు మంజూరు

Advertisement

తెలంగాణాలో పాత సచివాలయాన్ని కూల్చి కొత్త హంగులతో సచివాలయాన్ని నిర్మించాలి అని ఇప్పటికే పాత భవనాన్ని కూల్చివేసింది సర్కార్. అయితే తాజాగా కొత్త సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. అయితే ఈ మొత్తాన్ని ఆర్అండ్ బి శాఖ ద్వారా విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ కూడా వేయనున్నారు.

అయితే కొత్తగా నిర్మించబోయే సచివాలయం తూర్పు దిక్కున అభిముఖంగా ఉండనుంది. అలాగే ప్రతి అంతస్తులో భోజనానికి సంబంధించి డైనింగ్‌ హాలు, సమావేశాల కోసం మీటింగ్‌ హాలు ఉండనుంది.అంతేకాకుండా సచివాలయ సందర్శకుల కోసం ప్రత్యేకంగా వెయిటింగ్‌ హాల్, వాహనాలకు పార్కింగ్‌ వసతి ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపాడు. అయితే చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్‌ అండ్ పొన్ని అనే సంస్థ ఈ నమూనాలను డిజైన్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here