Snakes: ఇదెక్క‌డి ఆచారం.. పెళ్లికొడుకుకి క‌ట్నంగా 21 పాములు

Snakes: భార‌త‌దేశంలో వ‌ర‌క‌ట్నం సంప్ర‌దాయం త‌ర‌త‌రాలుగా న‌డుస్తుంది. యువ‌తికి పెళ్లి చేసే స‌మ‌యంలో పెళ్లి కొడుక్కుకి న‌గ‌దు, బంగారం, లేదంటే వ‌స్తువుల‌ను క‌ట్నంగా ఇస్తుంటారు. ఎవ‌రి స్థోమ‌త‌ను బ‌ట్టి వారు క‌ట్నాలు ఇస్తుంటారు. అయితే క‌ట్నాల విష‌యంలో ఎన్నోరాద్ధాంతాలు కూడా జ‌రుగుతున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. పెళ్లి స‌మ‌యానికి ముందుగా అనుకున్న క‌ట్నం ఇవ్వ‌లేద‌ని పెళ్లిళ్లు ఆగిపోయిన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి.

snakes

కొంద‌రు వ‌ర‌క‌ట్నం పేరుతో యువ‌తిని టార్చ‌ర్ పెట్టి ఆమె చావుకు కార‌ణ‌మైన సంద‌ర్భాలు లేక‌పోలేదు. ఏదేమైన వ‌ర‌క‌ట్న నిర్మూల‌నకి సంబంధించి ఎప్ప‌టి నుండో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తుంది. అయిన‌ప్ప‌టికీ దీనిపై స‌రైన నిర్ణ‌యం రావ‌డం లేదు. అయితే తాజాగా ఓ మామగారు కాబోయే అల్లుడికి 21 స‌ర్పాలు క‌ట్నంగా ఇచ్చాడు. వాటిని అల్లుడు న‌వ్వుతూ స్వీక‌రి్చాడు. ఈ విష‌యం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మధ్యప్రదేశ్‌లోని గొరియా తెగకు సంబంధించిన వారు పెళ్లిలో కట్నంగా నగదు, వస్తువులకు బదులుగా బతికున్న విషసర్పాలను వరుడికి అందిస్తారు. ఈ క్ర‌మంలోనే వధువు తండ్రి వరుడికి 21 పాములను కట్నంగా ఇవ్వడంతో మరోసారి చర్చనీయమైంది. అయితే ఈ పాముల‌ని క‌ట్నంగా ఇవ్వ‌డానికి కార‌ణం కూడా ఉంది. పెళ్లి ప‌విత్ర‌త‌ను కాపాడేందుకు పాములు స‌హ‌కరిస్తాయ‌ని గొరియా తెగ ప్ర‌జ‌లు చాలా విశ్వ‌సిస్తారు.

గొరియో తెగ ప్ర‌జ‌ల‌కు పాములు ప‌ట్టుకోవ‌డం ప్ర‌వృత్తి. పాముల‌ని వారు ఈజీగా ప‌ట్టుకుంటారు. ఈ తెగ‌లో పెళ్లైతే చాలు పాముల‌ను ప‌ట్టుకొని క‌ట్నంగా ఇస్తుంటారు. మ‌రి అన్ని పాముల‌తో వారు ఏం చేస్తారో అని నెటిజ‌న్స్ తెగ ముచ్చ‌టించుకుంటున్నారు.