2018 Movie : రూ.15 కోట్లతో తీస్తే.. రూ.200 కోట్లు వసూలు చేసిన 2018 మూవీ..!
NQ Staff - June 14, 2023 / 11:26 AM IST

2018 Movie : కొన్ని సార్లు హీరోల కంటే కూడా కంటెంట్ బాగుంటే సినిమా దుమ్ములేపుతుంది. అక్కడ స్టార్ హీరోలు కూడా అవసరం లేదు. చిన్న సినిమాలే ప్రభంజనాన్ని సృష్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు తాజాగా 2018 మూవీ కూడా ఇలాంటి సంచలనమే సృష్టిస్తోంది. ఈ సినిమా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
కేరళలో వచ్చిన వరదల ఆధారంగా ఈ సినిమాను తీశారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే ‘2018’. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించారు. విడుదలయ్యే వరకు పెద్దగా అంచనాలు లేవు. తొలి రోజు కేవలం రూ.1.8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ రోజురోజుకు పుంజుకుని కేరళ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది.

2018 Creating Sensation By Being Grossing Movie Kerala
ఏకంగా అక్కడ రూ.200 కోట్లను వసూలు చేసి కేరళలోనే టాప్ గ్రాస్ మూవీగా నిలిచింది. చాలా రియలస్టిక్ గా ఉన్న ఈ సినిమాకు అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. దాంతో అన్ని భాషల్లో సినిమాను డబ్ చేశారు. తెలుగులో కూడా అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి రిలీజ్ చేశారు.
ఇక్కడ కూడా దుమ్ము లేపుతోంది. తెలుగులో రూ.1.5 కోట్లతో కొనుగోలు చేస్తే.. ఏకంగా రూ.11 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రూ.5.8 కోట్ల లాభాలను తీసుకువచ్చింది ఈ సినిమా. దాంతో ఈ సినిమా గురించి ఇప్పుడు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.