Online Order: ఆన్‌లైన్‌లో లక్షల విలువజేసే ఫర్నిచర్ ఆర్డర్ చేసిన 20 నెల‌ల చిన్నారి

Online Order: చిన్నారుల నుండి పెద్ద వాళ్ల వార‌కు స్మార్ట్ ఫోన్‌లో మునిగి తేలుతున్నారు. ఫోన్ లేక‌పోతే ప్రపంచ ఆగిపోతుందేమో అనే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చిన్న పిల్లలు కూడా ఫోన్ కి చాలా అడిక్ట్ అయిపోయారు. మొబైల్‌ ఒక నిత్యావసరమైపోయింది. ఇటీవల కరోనా పుణ్యమా అని పిల్లలు ఆన్‌ క్లాసుల పేరుతో మొబైల్స్‌, ల్యాబ్‌టాప్‌లకు బాగా కనెక్ట్‌ అయిపోయారు. ఈ క్రమంలో ఓ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

20 Month Baby Order online of Furniture Worth Lakhs
20 Month Baby Order online of Furniture Worth Lakhs

న్యూజెర్సీలో నివసిస్తున్న అమెరికన్‌ ఇండియన్‌ దంపతులు ప్రమోద్‌, మధుకుమార్‌ ఇంటికి ఫర్నీచర్ వస్తువులు కొరియర్‌లో ఒక్కొక్కటిగా వచ్చి చేరుతున్నాయి. అయితే తాను ఆ వస్తువులు ఆర్డర్‌ చేయలేదంటూ మధుకుమార్‌ డెలివరీ బాయ్స్‌తో వాదనకు దిగింది. దాంతో వారు ఆర్డర్‌కి సంబంధించిన వివరాలను ఆమె ముందు ఉంచారు. దీంతో ఒక్కసారిగా ఆమె అవాక్కయ్యింది.

ఇరవై నెలల బాబు ఆయాన్ష్ త‌న తల్లి ఫోన్‌లో వాల్‌మార్ట్‌ యాప్‌లో కార్ట్‌లో పిక్‌ చేసి ఉన్న వస్తువులను చిన్నారి బాలుడు సునాయాసంగా ప్లేస్‌ ఆర్డర్‌ చేసేశాడు. ఇలా అమెరికన్‌ కరెన్సీలో 2000 డాలర్లు .. ఇండియన్‌ కరెన్సీలో లక్షా 49 వేల రూపాయల విలువైన వస్తువులు బుక్‌ చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయాన్ష్‌ ఎప్పుడు ఫోన్‌ పట్టుకునే ఉంటాడని, కానీ ఫేస్‌ రికగ్నేషన్‌, పాస్‌కోడ్‌ ఉన్న ఫోన్‌ను ఆయాన్ష్‌ ఎలా ఓపెన్‌ చేశాడన్నది మిస్టరీగా మారింది.

వెంటనే ఆ చిన్నారి చేతికి కొన్ని ఫోన్లు ఇవ్వగా ఈ మెయిల్స్‌ పంపడం, కాంటాక్ట్‌ లిస్ట్‌ చెక్‌ చేయడం, క్యాలెండర్‌ క్లోజ్‌ చేయవం వంటి పనులు పర్‌ఫెక్ట్‌గా చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకి అమెరికా మీడియాలో బాగా పాపులర్‌ అయ్యింది. దీంతో 20 నెలల చిచ్చర పిడుగు ఆయాన్ష్‌ ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్‌ సిసింద్రీగా మారాడు. పొరపాటున ఆర్డర్‌ చేసినట్టుగా తెలపడంతో.. సదరు ఫర్నీచర్‌ని వెనక్కి తీసుకునేందుకు సదరు సంస్థ అంగీకరించింది.