Compensation: హెయిర్ క‌ట్ స‌రిగా చేయ‌ని కార‌ణంగా రెండు కోట్లు న‌ష్ట ప‌రిహారం

Compensation: మ‌హిళ‌కు స‌రిగా క‌టింగ్ చేయ‌లేద‌ని అందుకు గాను రెండు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ కు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మోడలింగ్ లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్న ఆమె కల హోటల్ సిబ్బంది పొరపాటు కారణంగా సర్వనాశనం అయ్యింది అని వ్యాఖ్యానించింది.

2 Crores Compensation for not cutting hair Properly
2 Crores Compensation for not cutting hair Properly

మ‌హిళ‌ల‌కు జుట్టుతో భావోద్వేగ‌ప‌ర‌మైన అనుబంధం ఉంటుంది. కురుల సంర‌క్ష‌ణ కోసం వారు చాలా జాగ్ర‌త్త‌లు ప‌డుతుంటారు. మంచి స్థితిలో ఉంచుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శక్తికొద్దీ ఖర్చు చేస్తారు అంటూ ఎన్ సీడీఆర్ సీ అధ్యక్షుడు ఆర్కే అగర్వాల్, సభ్యుడు ఎస్ఎమ్ కాంతికార్ అన్నారు.

ఫిర్యాదు దారైన అషనా రాయ్ తనకున్న పొడవైన జుట్టు కారణంగా పలు కేశ సంరక్షణ ఉత్పత్తులకు మోడల్గా వ్యవహరించారని, అనేక పెద్ద బ్రాండ్లకు పనిచేశారని కమిషన్ పేర్కొంది. అయితే, ఆమె సూచనలకు వ్యతిరేకంగా హెయిర్ కట్ చేయడం వల్ల అవకాశాలు దూరమయ్యానని, ఆమె జీవితమే మారిపోయిందని, ఈనెల 21న జారీ చేసిన ఉత్తర్వులో కమిషన్ స్పష్టం చేసింది.

సిబ్బంది చేసిన పొర‌పాటు వ‌ల‌న త‌ల కాలిపోవ‌డంతో పాటు ఇప్ప‌టికీ దుర‌ద‌, అల‌ర్జీ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ట‌.ఫిర్యాదురాలి వాట్స్అప్ చాట్ ను పరిశీలించగా హోటల్ యాజమాన్యం తన తప్పును అంగీకరించడంతో పాటు దిద్దుబాటు చర్యలు చేపడతామని అంగీకరించిందని ఎన్ సీడీఆర్ సీ చెప్పింది.

సూచ‌న‌ల‌కు విరుద్ధంగా క్ష‌వ‌రం చేయ‌డం వ‌ల‌న ఆమె క‌ల చెడింది. అత్యున్న‌త మోడ‌ల్ కావాల‌న్న అషానా క‌ల నాశ‌న‌మైంది. అందుకే ఈ నెల 21న ఆమెకు రెండు కోట్లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది.