ఇండియాలో 19 లక్షలు దాటినా కరోనా కేసులు
Admin - August 5, 2020 / 07:01 AM IST

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అలాగే ఇండియాలో కూడా ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది. ఎలా అంటే రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఇండియాలో గత 24 గంటల్లో 52,509 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 19,08,254కి పెరిగి పోయింది. అలాగే గత 24 గంటల్లో దేశంలో 857 మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు.
ఇక మొత్తం మరణాల సంఖ్య 39,795కి చేరింది. గత 24 గంటల్లో 51,706 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు. దీనితో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 12,82,215కి చేరింది. అయితే దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 67.19 శాతంగా ఉంది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా కాస్త బెటరే అని వైద్య నిపుణులు అంచన వేస్తున్నారు.