17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

Advertisement

కరోనా దేశంలో రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే చాలా మంది ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 17 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 13న లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇక వీరిలో 17 మందికి కరోనా సోకినట్టు సమాచారం. అయితే వైరస్‌ బారిన పడినవారిలో అధికార బీజేపీ పార్టీకి చెందిన వారు 12 మంది సభ్యులు ఉన్నారు. అలాగే వైసిపికు చెందిన ఇద్దరు ఉండగా, శివసేన, డీఎంకే, ఆర్‌ఎల్‌పీ పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ గా నమోదు అయింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here