తెలంగాణ సచివాలయంలో 17 మందికి కరోనా

Advertisement

తెలంగాణాలో కరోనా దారుణంగా విస్తరిస్తుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారీగా పడ్డారు. ఇది ఇలా ఉంటె తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం రేపింది. సచివాలయంలో పనిచేస్తున్న 17 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పాత సచివాలయం కూల్చి, కొత్త సచివాలయం నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దాంట్లో ఆర్థికశాఖ, మానవ వనరుల శాఖ, ఇతర సెక్షన్లను బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని ఎనిమిదవ అంతస్తుకు తరలించారు.

ఇక దాంట్లో 17 మంది కరోనా పడ్డారు. ఇక కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో డీఎస్‌లు, ఏఎస్‌లు, ఎస్‌ఓలు, ఇతర నాలుగవ తరగతి ఉద్యోగులు కూడా ఉన్నారు. ఒకవైపు రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికి 1,17,415 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ వైరస్ బారిన పడి ఇప్పటికి 799 మంది మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here