15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గజిని

Admin - September 29, 2020 / 07:01 AM IST

15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గజిని

మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన గజిని మూవీ విడుదల అయ్యి నేటికి 15 సంవత్సరాలు పూర్తి అయ్యింది. తమిళ్ విడుదల అయిన ఈ మూవీ అప్పట్లో రికార్డ్ ను సృష్టించింది. షార్ట్ టైం మెమరీ లాస్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని మురుగదాస్ ఈ కథను రాసుకున్నారు. తమిళ్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ వర్షన్ తో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీతో సూర్యను తెలుగు ప్రజల తమ హీరో అన్నట్టు ఓన్ చేసుకున్నారు.

ఈ మూవీ కాన్సెప్ట్, సూర్య యాక్టింగ్ కు తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు. ఈ తెలుగులో కూడా విజయం సాధించడంతో సూర్య యొక్క మిగితా మూవీస్ ను కూడా డబ్ చేసి, విడుదల చేశారు. ఈ మూవీని తరువాత కాలంలో హిందీలో రీమేక్ చెయ్యగా అందులో అమీర్ ఖాన్ నటించారు. అక్కడ ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీ కథను క్రిష్టఫర్ నోలన్ తీసిన మెమెంటో అనే చిత్రంను స్ఫూర్తిగా తీసుకొని రాసుకున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us