Minister Malla Reddy : మల్లారెడ్డిపై ఐటీ దాడులు: 15 కోట్ల నగదు స్వాధీనం.!

NQ Staff - November 24, 2022 / 08:29 PM IST

Minister Malla Reddy : మల్లారెడ్డిపై ఐటీ దాడులు: 15 కోట్ల నగదు స్వాధీనం.!

Minister Malla Reddy : ఎట్టకేలకు మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. దాదాపు మూడు రోజులపాటు సుమారు 400 మంది ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్ళు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బంధువుల ఇళ్ళలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

తొలుత ఆరు కోట్ల రూపాయల నగదుని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, మొత్తంగా ఐటీ సోదాలు నేటి మధ్యాహ్నంతో ముగిశాక, ఐటీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఏకంగా 15 కోట్ల రూపాయల నగదు లభ్యమయినట్లు తెలుస్తోంది.

135 కోట్ల రూపాయల డొనేషన్లు..

మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించి 135 కోట్ల రూపాయల మేర డొనేషన్ల కింద వసూలు చేసినట్లు ఐటీ సోదాల్లో గుర్తించారు. 400 మంది ఐటీ అధికారులు 65 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున అధికారుల్ని ఐటీ శాఖ రప్పించి ఈ సోదాలు నిర్వహించింది.

కాగా, ఈ నెల 28, 29 తేదీల్లో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ఐటీ శాఖ సమన్లు జారీ చేయడం గమనార్హం.

అయితే, వంద కోట్ల మేర అవకతవకలు అనే ప్రచారంలో నిజం లేదనీ, తన ఇంటితోపాటు, తన కుమారుల ఇళ్ళలో జరిపిన సోదాల్లో కేవలం 28 లక్షలు మాత్రమే దొరికాయనీ, వాటికీ లెక్కలున్నాయని మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us