Heart Attack : గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం..!

NQ Staff - April 1, 2023 / 01:27 PM IST

Heart Attack : గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం..!

Heart Attack : గత రెండు నెలలుగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ప్రతిరోజూ ఈ గుండెపోటుతో ఒకరో ఇద్దరో మరణిస్తూనే ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారిని కూడా ఇది కబలిస్తోంది. తాజగా ఓ బాలికను బలితీసుకుంది ఈ గుండెపోటు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, అబ్బాయిపాలెం శివారు బోరుతండాకు చెందిన లక్పతి, వసంత దంపతుల కుమార్తె స్రవంతి(13). ఆమె స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శ్రీరామ నవమి రోజున సెలవు కావడంతో ఆమె స్నేహితులతో రోజంతా ఆడుకుంది.

రాత్రి అమ్మ చేతివంట తిని, నానమ్మ వద్దకు వెళ్లింది. తనక కథ చెప్పమంటూ అక్కడే పడుకుంది. తెల్లవారు జామున 3గంటల సమయంలో తనకు చాతిలో నొప్పి వస్తోందంటూ నానమ్మను లేపింది. మూత్ర విసర్జన చేసి వచ్చిన తర్వాత ఒక్క సారిగా మంచంపై కుప్ప కూలిపోయింది.

కంగారు పడిన తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆర్ ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెల్లారు. కానీ అప్పటికే ఆమె గుండె ఆగిపోయినట్టు చెప్పడంతో శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ వార్త ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. 13 ఏండ్ల అమ్మాయికి గుండెపోటు రావడం ఏంటని విస్తుపోతున్నారు. ఎప్పుడు ఎవరు గుండెపోటుతో పోతారో చెప్పడం చాలా కష్టంగా మారిందంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us