ఐపీల్ కు వెళ్లిన వారిలో 13 మందికి కరోనా : బీసీసీఐ

Advertisement

ఈ ఏడాది ఐపీల్ సీజన్ యూఏఈ దేశంలో నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని టీమ్ లకు చెందిన క్రీడాకారులు యూఏఈ చేరుకున్నారు. అయితే దాంట్లో అందరికి కరోనా టెస్టులు చేయగా ఇద్దరు ఆటగాళ్లు, కొంతమంది సహాయ సిబ్బంది కరోనా బారినపడ్డారని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక దాంట్లో ఇద్దరు ప్లేయర్లు ఉన్నారని వెల్లడించింది.

కరోనా బాధితులతో పాటు వీరితో దగ్గరగా కాంటాక్ట్‌ అయిన వారికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. అలాగే వారందరినీ కూడా ఇతర జట్ల నుంచి వేరు చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. అలాగే ఎల్లవేళలా అందరిని ఐపీఎల్‌ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోందని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ప్రస్తుతం కరోనా బారిన పడ్డ క్రీడాకారుల్లో ఇద్దరు చెన్నై టీమ్ కి చెందినవారే.. దాంట్లో ఒకరు బౌలర్ దీపక్ చాహర్, మరొకరు యువ బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్ లు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here