33 ఏళ్ల తర్వాత 10th పాస్… అది కూడా ఎలానో తెలుసుకోండి..

Advertisement

కరోనా మహమ్మారి దాటికి ప్రతిఒక్కరు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే కరోనా వల్ల ప్రతిఒక్కరి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఇలా కరోనా అందరికి బాధ కలిగిస్తున్న సమయంలో ఓ వ్యక్తికి మాత్రం ఆనంద పడేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే తన జీవితాన్నే మార్చేసింది.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరానికి చెందిన మ‌హ‌మ్మ‌ద్ నూరుద్దీన్ 33 ఏళ్లుగా ప‌దవ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో పాస్ అయ్యేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఎంత ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి కరోనా కారణంగా రాత్రికి రాత్రే పాస్ అయిపోయాడు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులందరిని ప్రమోట్ చేసింది. ఇక నూరుద్దీన్ కూడా పాస్ అయ్యి తన కళ నెరవేర్చుకున్నారు.

అయితే నూరుద్దీన్ 1987లో మొదటి సారి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాశాడు. అయితే అప్పుడు ఒక్క ఇంగ్లీష్ తప్ప అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు. ఆ ఇంగ్లిష్ సబ్జెక్టు పాస్ అవ్వడానికి 33 ఏళ్ళ నుండి తీవ్రంగా కష్టపడుతున్నాడు. ప్ర‌తీసారి 32, 33 మార్కుల వ‌ర‌కూ మాత్రమే వ‌స్తున్నాయి. కానీ ఈ సారి అత‌న్ని అదృష్టం వెంటాడింది.

అయితే ప్ర‌తి ఏడాది రెగ్యుల‌ర్ విద్యార్థిగా అప్లై చేసి ఒక్క ఇంగ్లిష్ ప‌రీక్ష మాత్ర‌మే రాసేవాడు. ఈసారి స‌కాలంలో ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోలేక‌పోయాడు. దీనితో ఓపెన్‌లో అప్లై చేసుకోవాల్సి వ‌చ్చింది. దీనితో అత‌ను ఒక్క ఇంగ్లిష్ మాత్ర‌మే కాకుండా, మిగిలిన ఆరు ప‌రీక్ష‌లు కూడా రాయాల్సిన ప‌రిస్థితి వచ్చింది.

మొత్తానికి కరోనాతో తనను అదృష్ట్రం వరించింది. 35 శాతం మార్కుల‌తో ఫైన‌ల్‌గా పదవ తరగతి పాస్ అయ్యాడు నూరుద్దీన్. ఇక 33 ఏళ్ళ తరువాత పది పాస్ అయ్యేసరికి అందరు తన ఆత్మస్తైర్యాన్ని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here