కర్నూల్: కరోనా మహమ్మారి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు. కరోనా మరణాలు కూడా వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వయసుతో సంబంధం లేకుండా కరోనాను జయిస్తున్నారు. 70 ఏళ్ళు దాటినా వృద్ధులు కూడా తమకున్న ప్రణాళికబద్ధమైన ఆహారపు అలవాట్ల వల్ల కరోనాను జయిస్తున్నారు.
కర్నూల్ కు చెందిన బీ మోహనమ్మకు 105 సంవత్సరాలు. ఈ మధ్య వారి ప్రాంతంలో కరోనా టెస్టులు చేయగా మోహనమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు గాబరపడ్డారు. జులై 13న జీజీ హెచ్ హాస్పిటల్ చేరిన మోహనమ్మ తనకున్న అలవాట్ల వల్ల కరోనాను జయించారు. ప్రతిరోజు ఇంటి దగ్గర చేసే యోగ, ప్రాణాయమలు హాస్పిటల్ లొనే బెడ్ పైన చేసేవారు. తన ధైర్యాన్ని చూసి వైద్యులు ఆమెను మెచ్చుకునేవారు. తాను ప్లేగు వ్యాధిని దగ్గర నుండి చూశానని, చిన్నప్పటి నుండి రాగి ముద్దలు, కొర్రలు, జొన్న సంకటి తినటం వల్ల తనలో ఇమ్మ్యూనిటి శక్తి అధికంగా ఉందని మోహనమ్మ తెలిపారు. తనకున్న ఆహారపు అలవాట్లు, యోగ, ధ్యానం లాంటి అలవాట్లే తమ తల్లిని కరోనా నుండి బయటపడేలా చేశాయని కుటుంబ సభ్యులు తెలిపారు.