ఒక్క వ్యక్తి తో 100 మందికి కరోనా

Advertisement

కరోనా పట్టణం, పల్లె అని తేడా లేకుండా అంతటా విస్తరిస్తుంది. ఇది ఇలా ఉంటె ఓ గ్రామంలో ఒక్క వ్యక్తితో ఏకంగా వంద మంది కరోనా బారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో సంచలన విషయం జరిగింది. అయితే ఆ గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లో ఈ నెల మొదటి వారంలో పెన్షన్ల పంపిణి చేసారు. ఇక పెన్షన్ కు అర్హులైన వృద్దులు, వితంతువులు అందరు కూడా లైన్లలో నిలబడి డబ్బులు తీసుకున్నారు.

అయితే ఇటీవలే పోస్ట్ ఆఫీస్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక దీనితో పెన్షన్లు తీసుకున్న వారందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇక దాంట్లో 100 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇక ఆ గ్రామంలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. అలాగే పాజిటివ్ వచ్చిన వారందరు కూడా క్వారంటైన్ లో ఉంచి వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here