ఎలుక వల్ల కోటి రూపాయలు నష్టం. ఎలా అయిందంటే..

Advertisement

ఓ ఎలుక వల్ల కోటి రూపాయల నష్టం వాటిల్లింది. ఇది వినడానికి వింతగా ఉన్న నిజం. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని ముషీరాబాద్‌ ప్రాంతంలో మిత్రా మోటార్స్‌ కార్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఫిబ్రవరి 8న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో మూడు కార్లు, ఫర్నిచర్‌ కాలిపోయాయి. దాదాపుగా కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన గురించి పోలీసులు దర్యాప్తు చేయగా షార్ట్ సర్క్యూట్ అని కేసును ముగించారు. ఆ రోజు రాత్రి సీసీటీవీని క్షుణ్ణంగా పరిశీలించిన ట్రూత్‌ ట్యాబ్స్‌ ఫోరెన్సిక్‌ అనే సంస్థ దాదాపు ఆరు నెలల తర్వాత ఆ ఘటనకు గల కారణం అగ్నిప్రమాదం అని నిర్ధారించింది.

అయితే ట్రూత్‌ ట్యాబ్స్‌ ఫోరెన్సిక్ చేసిన పరిశీలనలో.. ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 10 గంటల సమయాన పూజ కోసం ఓ ఉద్యోగి దీపం వెలిగించినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అయితే ఆ దీపం రాత్రి వరకు వెలుగుతూనే ఉంది. ఇక రాత్రి 11.51 గంటల సమయంలో కస్టమర్‌ సర్వీస్‌ రూమ్‌లో ఓ టేబుల్‌పై ఎలుక వచ్చినట్లు కనిపించింది. ఇక 11.55 గంటలకు ఆ ఎలుక ఏదో నిప్పులాంటి వస్తువును పట్టుకుని తిరిగింది. చివరకు దాన్ని తీసుకెళ్లి కుర్చీ వద్ద వదిలేసింది. అయితే పూజ కోసం దీపంలో వెలిగించిన ఒత్తిని తీసుకొచ్చినట్లు వారు భావిస్తున్నారు. ఇక ఆ కుర్చీలో పడిన ఆ నిప్పు, మంటగా మరి కింద ఫ్లోర్ కు ఆ మంటలు సంభవించాయి. దీనితో ఆ కార్యాలయంలో ఉన్న ఫుర్నిచర్ తో సహా రిపేర్ లో ఉన్న కార్లు కాలిపోయాయి. ఇక ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఎలుక అని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here