దక్షిణాదిలో అరుదైన రికార్డ్ ను సృష్టించిన యాంకర్ ప్రదీప్

Advertisement

యాంకర్ ప్రదీప్ టీవీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపును సంపాందించుకున్నాడు. తన యాంకరింగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. టీవీ ఇండస్ట్రీలో తనకు వచ్చిన గుర్తింపును ఉపయోగించుకొని మూవీ ఇండస్ట్రీలో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తాను హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీని ప్లాన్ చేసుకున్నాడు. ఈ మూవీకి మున్నా అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నారు.

అయితే ఈ మూవీలో నుండి విడుదల అయిన “నీలి నీలి ఆకాశం, ఇద్దామనుకున్నా” అనే పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదల అయిన తరువాత యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ పాట మరో కొత్త రికార్డ్ ను సృష్టించింది. అన్ని ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లలో కలిపి మొత్తం 200 వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ సౌత్ ఇండియాలోనే మొదటి సారి.ఈ పాటను చంద్రబోస్ రాయగా, సునీత, సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటకు అనూప్ రెబెన్స్ సంగీతం అందించారు. ఈ పాటను మహేష్ బాబు విడుదల చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here