తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కట్టడికి చర్యలు

Advertisement

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.ఇక మన దేశం ప్రపంచంలోనే కరోనా కేసుల్లో మూడో స్థానానికి చేరుకుంది. అంటే ఇక ఎంత వేగంగా విస్తరిస్తుందో మీకే అర్ధమవుతుంది. ఇక తెలంగాణాలో సైతం చరవేగంగా వ్యాపిస్తుంది. రోజుకు వెయ్యి కేసులు పైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణాలో వచ్చే కేసుల్లో ఎనబై శాతం పైగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదవుతున్నాయి.

అయితే హైదరాబాద్ వాసులు మాత్రం కనీసం జాగ్రత్తలు తీసుకోవడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. మొన్న మాస్క్ లు పెట్టుకొని వారిపై కేసులు విదిస్తే ఒక్క హైదరాబాద్ లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి అని పోలీసులు తెలిపారు. ఒకవైపు ప్రభుత్వాలు, వైద్యులు,పోలీసులు ఇతర నిపుణులు అందరు మాస్కులు పెట్టుకోవాలని మరియు శానిటైజర్ వాడాలని అవగాహనా కలిపిస్తూనే ఉన్నారు.

ఇది ఇలా ఉంటె తెలంగాణాలో సరిగ్గా టెస్టులు చేయడం లేదని అందుకోసమే కేసులు ఎక్కుగా నమోదవుతున్నాయి అని అటు సోషల్ మీడీయాలో నెటిజన్లు మరియు ప్రతిపక్ష నాయకులూ ఆరోపిస్తున్నారు.ఇప్పటికే కరోనా కట్టడి గురించి గవర్నర్ కూడా అధికారులతో చర్చ జరిపిన విషయం తెలిసిందే..

అయితే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంత గణనీయంగా పెరుగుతాయి అని ముందే ఉహించారంట నిపుణులు. ఈ అన్ లాక్ సమయంలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ సమయంలో పూర్తిగా కట్టడి చేసిన ప్రాంతాల నుండి కూడా అత్యధికంగా కేసులు రావడంతో అత్యంత దారుణమైన విషయం గా అధికారులు చెబుతున్నారు.

అయితే తెలంగాణ లో ఎనమిది వందల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలనీ అధికారులు ఆ దిశగా పక్క ప్రణాలికతో అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం లో రోజుకు వెయ్యి నుండి రెండు వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. అంటే ఈ లెక్కన చూసుకుంటే నెలకు యాబై వేలకు పైగా కేసులు నమోదయ్యే పరిస్థితి ఉంది. దింట్లో ఒక్క హైదరాబాద్ లోనే ముప్పై ఐదు వేలకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్క హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదవుతుండడం తో నగర వాసులు బయాందోళన కు గురవుతున్నారు.

మొత్తానికి ఈ కరోనా మహమ్మారి కంటికింద కునుకు లేకుండా చేస్తున్న తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతుంది. తెలంగాణాలో రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో రెండు లక్షల రాపిడ్ టెస్టుల కిట్లను రాష్ట్ర ప్రభుత్వం సమర్చుకుంది. అయితే ICMR సూచనల ప్రకారం అన్ని రాష్ట్రాలలోని కంటైన్మెంట్ జోన్లలో టెస్టులు నిర్వహించాలని చుచించింది.

అయితే ముఖ్యంగా ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రవేట్ హాస్పటల్ ల్లలో మాత్రమే ఈ రాపిడ్ టెస్టులు చేయనున్నారు. ముఖ్యంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే ఈ టెస్టులు చేయనున్నారు. ఎటువంటి జబ్బు మరియు ఎటువంటి లక్షణాలు లేకుండా తమకు కరోనా ఉందని తెలుసుకుందాం అనే వారికీ ఈ టెస్టులు చేయబోము అని స్పష్టం చేసారు. ఈ యాంటిజెన్ టెస్టులు చేయడానికి మిషన్లు అవసరం లేదు అని అరగంటలో కరోనా ఉందా లేదా అనే విషయం తెలువనుంది అని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here