అఖిలప్రియ భర్త సామాన్యుడు కాదు.. పోలీసులకే సవాలుగా మారాడు

bhargav rambhargav ram
bhargav ram

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు భార్గ‌వ్ రామ్ పోలీసులకు సవాల్ గా మారిపోయాడు. ఈ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియా కూడా అరెస్ట్ అయిన కానీ ఆమె భర్త ఆచూకీ ఇప్పటికి తెలియకపోవటం విడ్డురమే, అఖిల ప్రియా అరెస్ట్ అయిన తర్వాత అనేక విధాలుగా బెయిల్ కోసం అప్లై చేసిన కానీ అనేక కారణాలు చూపిస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు చాలా రోజులు, చివరికి ఎలాగోలా బెయిల్ రావటంతో ఆమె బయటకు వచ్చింది. నిజానికి భార్గ‌వ్ రామ్ ముందుగానే అరెస్ట్ అయ్యి ఉంటే ఆమెకు తొందరగానే బెయిల్ దొరికేది అనే మాటలు వినిపిస్తున్నాయి.

bhargav rambhargav ram

తన భార్య పైగా గర్భవతి అయ్యి కూడా జైల్లో ఉన్నకాని భార్గ‌వ్ రామ్ మాత్రం ఎక్కడ ఆచూకీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్ర‌మంలో తాజాగా భార్గ‌వ్ రామ్ కుటుంబం కోర్టును ఆశ్ర‌యించింద‌ట‌. అత‌డికి ముంద‌స్తు బెయిల్ ను కోరుతూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింద‌ట అత‌డి కుటుంబం. అయితే కోర్టు ఆ బెయిల్ పిటిష‌న్ ను తిర‌స్క‌రించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

త‌ను దొర‌క‌కుండా ప‌రారీలో ఉంటూ.. ఈ కేసులో త‌న వాద‌న ఏదో కూడా వినిపించుకోవ‌డానికి భ‌య‌ప‌డిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న మాజీ మంత్రి అఖిల‌ప్రియ భ‌ర్త ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌డం విడ్డూర‌మే. ఇంత‌టి విడ్డూరం ప‌ట్ల కోర్టు కూడా ఘాటుగానే స్పందించిన‌ట్టుగా ఉంది. ముంద‌స్తు బెయిల్ కు నో చెప్పి లొంగిపోవాల‌నే సందేశాన్ని అఖిల‌ప్రియ భ‌ర్త‌కు ఇచ్చిన‌ట్టుగా ఉంది.

నిజానికి ఈ కేసులో తన హస్తం ఉన్నట్లు పెద్దగా ఆధారాలు లభించవు అనుకోని దైర్యంగా ఉన్న భార్గ‌వ్ రామ్ కు, మెల్ల మెల్లగా తన పాత్ర మీద పోలీసులకు తగిన సాక్ష్యాధారాలు లభించటంతో పరారీలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. అందుకే ముందస్తు బెయిల్ కావాలని జగత్ విఖ్యాత్ కోరినట్లు తెలుస్తుంది. ఈ కేసులో భార్గ‌వ్ రామ్ మీద ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని జగత్ విఖ్యాత్ వ్యాఖ్యానించటం జరిగింది. అయితే అత‌డికి ముంద‌స్తు బెయిల్ ను కోరుతూ న్యాయ‌స్థానాన్ని ఆశ్రహించిన అతడి కుటుంబానికి కోర్ట్ లో చుక్కెదురైనట్లు తెలుస్తుంది. ఆ బెయిల్ పిటిష‌న్ ను కోర్టు తిర‌స్క‌రించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement