Vaccine: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే పోయిన చూపు తిరిగొచ్చింద‌ట‌..!

Vaccine: వైద్య‌శాస్త్రంలో జరిగే కొన్ని అద్భుతాలు చూస్తుంటే అవి శాస్త్రవేత్త‌ల‌కు కూడా ఓ ప‌ట్టాన అర్ధం కావు. ఏదో అద్భుతం జ‌రిగిన‌ట్టు ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌ర‌గ‌గా, ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న ఎంద‌రో మృత్యువాత ప‌డుతుండ‌డంతో చాలా మంది భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

Women get Eye Sight With Covid Vaccine
Women get Eye Sight With Covid Vaccine

కాస్త మ‌ర‌ణాల‌ని త‌గ్గించే క్ర‌మంలో శాస్త్ర‌వేత్త‌లు వెంట‌వెంట‌నే వ్యాక్సిన్‌లు త‌యారు చేసి కొంత క‌రోనా ప్ర‌వాహాన్ని అడ్డుకోగ‌లిగారు. థ‌ర్డ్ వేవ్ వ‌స్తున్న‌ప్ప‌టికీ క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నందున ప్ర‌జ‌లు త‌మ కార్య‌కల‌పాల‌ను స‌జావుగా జ‌రుపుకుంటున్నారు. అయితే ఇప్ప‌టికీ క‌రోనా వ్యాక్సిన్ డ్రైవ్ జ‌రుగుతుంది.

సాధార‌ణంగా కరోనా టీకా వేసుకుంటే జ్వ‌రం, ఒళ్లు నొప్పులు, త‌ల నొప్పి ఇలాంటి రావ‌డం స‌హజం. కాని ఓ మ‌హిళ‌కు పోయిన కంటి చూపు తిరిగి వచ్చిందట‌. ఇది చాలా మందిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. వివ‌రాల‌లోకి వెళితే మ‌హారాష్ట్ర‌లోని వాసింకు చెందిన 70 ఏళ్ల మ‌హిళ మ‌ధురాబాయి బిద‌వే తొమ్మిదేళ్ల కింద‌ట కాట‌రాక్ట్ శ‌స్త్ర చికిత్స చేయించుకుంది. వైద్యుల నిర్ల‌క్ష్య‌మో,ఇత‌ర కార‌ణాలు ఏవోతెలియ‌దు కాని ఆమె త‌న చూపుని పూర్తిగా కోల్పోయింది.

కరోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌నిస‌రి టీకా వేయించుకోవాలి అని చెప్ప‌డంతో జూన్ 26 మ‌ధురాబాయి ఓ కేంద్రానికి వెళ్లి కోవిషీల్డ్ తీసుకుంది. మ‌రుస‌టి రోజు క‌ళ్లు క‌నిపించ‌డం మొద‌ల‌య్యాయ‌ట‌. ఈ విష‌యం అంద‌రికి చెప్ప‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. కొంద‌రు కంటి వైద్యులు ఆమె కంటిని ప‌రీక్షించి తిరిగి చూపు రావ‌డానికి కార‌ణం వ్యాక్సినా? లేదంటే ఇత‌ర కార‌ణం ఏమైన ఉందా అని క‌నుక్కునే ప‌నిలో ఉన్నార‌ట‌.