Cab Driver : ఢిల్లీలో క్యాబ్ డ్రైవ‌ర్ చెంప చెళ్లుమనిపించిన యువ‌తి…!

Cab Driver : మొన్నామ‌ధ్య ల‌క్నోలో లక్నోలో నడిరోడ్డుపై ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను చెంప దెబ్బలు కొట్టిన ఘటన సంచలనమైనంది. రోడ్డు దాటుతున్న ప్రియదర్శిని అనే యువతి.. క్యాబ్ తనను ఢీకొట్టబోయిందనే కారణంతో డ్రైవర్‌ను కార్లో నుంచి బయటకు లాగి మరీ చేయి చేసుకుంది. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై సైతం ప్రతాపం చూపించింది.

వీడియో, సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చాక.. అసలు తప్పు ఆ యువతిదేనని తేలింది. సోషల్ మీడియాలో అరెస్ట్ లక్నో గర్ల్ అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు చేశారు. ఒత్తిడి పెరిగిపోవడంతో పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. ‘‘తను కార్లో నుంచి నా ఫోన్‌ను లాగేసుకుంది. దాని ముక్కముక్కలుగా పగలగొట్టింది. కారు సైడ్ మిర్రర్లను సైతం పగలగొట్టింది అని అన్నాడు.

ఆ మహిళ చెప్పిందే విన్నారు, కానీ.. నా తప్పేంటి సార్.. అని పదే పదే అడిగినా పట్టించుకున్న నాథుడు లేడు. నేనో పేద క్యాబ్ డ్రైవర్‌ను. నాకు ఏం అక్కర్లేదు. నా ఆత్మగౌరవాన్ని నాకు తిరిగిస్తే చాలు. నాకు న్యాయం కావాలి అని అడిగాడు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.

ఒక మహిళ, క్యాబ్‌ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అయితే రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండటంతో వారి వాహనానికి ఒక క్యాబ్‌ డ్రైవర్‌ దారి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన టీ షర్టు ధరించిన మహిళ క్యాబ్‌ డ్రైవర్‌ను కారు నుంచి బయటకు లాగింది.

అందరూ చూస్తుండగా చొక్కా పట్టుకుని దూషిస్తూ అతడి చెంపపై కొట్టింది. అక్కడున్న కొందరు సర్ది చెప్పేందుకు యత్నించగా వారిపై కూడా ఆ మహిళ విరుచుకుపడింది.కాగా, కొందరు ఈ ఘటనను తమ మొబైల్‌ చిత్రీకరించారు. ఆదిత్య సింగ్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ దీనిని పోస్ట్‌ చేశారు. ఈ ఘటన చూసి తాను చాలా బాధపడినట్లు అందులో పేర్కొన్నారు.