WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచ‌ర్.. మీరు మెసేజ్ చ‌దివిన బ్లూ టిక్ ప‌డ‌దు

WhatsApp: ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎంత‌గా ఉపయోగ‌ప‌డుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రిలో వాట్సాప్ త‌ప్ప‌క ఉంటుంది. యూజర్స్‌కి అనుకూలంగా ఎప్ప‌క‌టిక‌ప్పుడు కొత్త అప్‌డేట్స్ ఇస్తూ, మ‌రిన్ని ఫీచ‌ర్స్ తీసుకొస్తూ ఆక‌ట్టుకుంటుంది. ఐఫోన్లు, ఐప్యాడ్లు వాడుతున్న ఐఓఎస్​ యూజర్ల కోసం ఓ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఇందులోభాగంగా ఎవ‌రైన మెసేజ్ మీరు చ‌దివిన బ్లూ టిక్ కూడా రాకుండా చ‌దివే ఆప్ష‌న్ తీసుకొచ్చింది.

whatsapp

సాధార‌ణంగా మ‌నం అవ‌త‌లి వారి మెసేజ్ చదివితే వారికి బ్లూ టిక్ క‌నిపిస్తుంది. కొంద‌రు బ్లూ టిక్ క‌న‌ప‌డ‌కుండా చ‌ద‌వాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే చిన్న మేసేజ‌ల‌ని నోటిఫికేష‌న్ వ‌చ్చిన స‌మ‌యంలో చ‌ద‌వ‌డంతో బ్లూ టిక్ క‌నిపించ‌దు. అదే పెద్ద మెసేజ్‌లు చ‌దవాలన్న‌ప్పుడు మాత్రం త‌ప్ప‌క బ్లూ టిక్ ద‌ర్శ‌న మిస్తుంది. అయితే ఇప్పుడు దీంతో మెసేజ్ చదివినట్టు అవతలి తెలియకుండా బ్లూటిక్ పడకుండానే నోటిఫికేషన్లలోనే మెసేజ్​ను పూర్తిగా చూడవచ్చు.

చాట్ మొత్తాన్ని బ్లూ టిక్ ప‌డ‌కుండా చదివే వీలుండ‌గా, ఇన్​-యాప్ నోటిఫికేన్లలో ఈ ఫీచర్ తీసుకొచ్చింది వాట్సాప్​. కొత్తగా తీసుకొచ్చిన 2.21.140.9 బీటా వర్షన్​లో యూజర్లకు ఈ ఫీచర్​ అందుబాటులోకి వచ్చిందని డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించింది. నోటిఫికేషన్ బ్యానర్​లోనే చాట్​కు సంబంధించిన మరిన్ని వివరాల​ను చూడవచ్చు.

నోటిఫికేష‌న్‌లో యూజర్స్ మెసేజ్ చ‌దువుకోవ‌చ్చ‌, ఎక్కువ ఉంటే పెద్ద‌గా చేసి చ‌దివే స‌దుపాయం కూడా ఉంది. ప్రివ్యూ చాట్​ స్టాటిక్​గా ఉండకుండా.. మెసేజ్ పెద్దగా ఉంటే స్క్రోల్​ కూడా అవుతుందని డబ్ల్యూఏబీటా ఇన్ఫో పేర్కొంది. అలాగే స్క్రోల్ చేస్తూ పైన మెసేజ్​లు చదవడంతో పాటు పాత మెసేజ్​లన్నీ చదివేందుకు కిందికి స్క్రోల్ చేయవచ్చు. మెసేజ్​లే కాకుండా ఇమేజ్​లు, జిఫ్​లు, వీడియోలు, స్టిక్కర్లు కూడా నోటిఫికేషన్లలోనే చూడవచ్చు.

చాట్‌లోకి వెళ్ల‌కుండానే మనం బ్లూ టిక్ రాకుండా మెసేజ్ చ‌ద‌వొచ్చు. ఒకవేళ రీడ్​ రిసిప్ట్స్​​ ఆన్​లో ఉన్నా బ్లూటిక్ రాదు. అయితే నోటిఫికేషన్​ నుంచే రిప్లే ఇవ్వాలనుకుంటే మాత్రం బ్లూటిక్స్ వచ్చేస్తాయి. మ‌రోవైపు ఫొటోల విష‌యంలోను వాట్సాప్ ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఒరిజినల్ క్వాలిటీతోనే ఫొటోలు పంపే ఫీచర్​ను కూడా త్వరలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ ఆపరేటింగ్ సిస్టంలకు తీసుకురావాలని ఆలోచిస్తోంది.

ఇమేజ్ అప్​లోడ్ చేసే సమయంలోనే వాట్సాప్ ప‌లు ఆప్షన్లను చూపిస్తుంది. బెస్ట్ క్వాలిటీ కావాలి అనుకుంటే ఆ ఆప్ష‌న్‌ని ఎంపిక చేసుకొని ఫోటోలు పంప‌వ‌చ్చు. ఒకవేళ డేటా ఎక్కువవుతుందనుకుంటే డేటా సేవర్​, ఆటో అయినా సెలక్ట్ చేసుకోవచ్చు. అధునాత‌మైన ఆప్ష‌న్స్ తో వాట్సాప్ వినియోగ‌దారుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తుంది.