Sonia Gandhi : ఈడీ పిలుస్తోంది.. సోనియాగాంధీ ఈసారైనా వెళ్తారా.?

NQ Staff - July 12, 2022 / 08:04 AM IST

Sonia Gandhi : ఈడీ పిలుస్తోంది.. సోనియాగాంధీ ఈసారైనా వెళ్తారా.?

Sonia Gandhi : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోమారు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమన్లు పంపింది. నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి సోనియాగాంధీ సహా ఆమె తనయుడు రాహుల్ గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే.

What are the ED and IT cases enquiry Sonia Gandhi

What are the ED and IT cases enquiry Sonia Gandhi

రాహుల్ గాంధీ ఇటీవల ఐదు రోజులపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశాయి. సోనియా గాంధీ కూడా అప్పుడే ఈడీ విచారణకు హాజరు కావాల్సి వుండగా, ఆమెకు అనారోగ్యం కారణంగా అది వీలు పడలేదు.

విశ్రాంతి తీసుకుంటున్న సోనియా.. విచారణకు వెళతారా.?

సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే ఆమెకు మరోమారు ఈడీ నోటీసులు పంపినప్పటికీ, కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరమంటూ వైద్యులు సూచించిన విషయాన్ని ఈడీకీ తెలిపి, తగిన గడువు కోరారు సోనియా.

తాజాగా ఈ నెల 21న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఇంకోసారి సమన్లు పంపింది. మరి, ఈసారి సోనియా ఎలా స్పందిస్తారు.? అన్నది ఉత్కంఠగా మారింది. అక్రమంగా కేసులు బనాయించి ఈడీ, సీబీఐ వంటి వాటిని బీజేపీ తమ రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే.

Read Today's Latest National in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us