Venkaiah Naidu: రాజ్య‌స‌భ‌లో కంట‌త‌డి పెట్టిన వెంకయ్య‌.. ఎందుకో తెలుసా?

Venkaiah Naidu: రాజ్య‌స‌భ‌లో విప‌క్షాలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఛైర్మన్ వెంక‌య్య నాయుడు అస‌హ‌నం వ్య‌క్ం చేశారు. స‌భ‌లో జ‌రిగిన ఘ‌న‌ట‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు భావోద్వేగానికి కూడా గుర‌య్యారు. రాజ్య‌స‌భ‌లో ఇలాంటి ప‌రిస్థితులు నెలకొన‌డం దుర‌దృష్ట‌క‌మంటూఆయ‌న కంట‌త‌డి పెట్టుకున్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌కు నాకు నిద్ర కూడా లేదు. ప్ర‌జాస్వామ్యానికి పార్ల‌మెంట్ ఒక ప‌విత్ర‌మైన దేవాల‌యం లాంటిది.

Venkaiah Naidu

కొంద‌రు స‌భ్యులు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తిస్తూ , టేబుళ్ల‌పై కూర్చొని, పోడియం ఎక్కి నిర‌స‌న తెలుపుతున్నారు. స‌భ ప‌విత్ర‌త‌ను కాపాడ‌టంలో అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. మంగ‌ళ‌వారం స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను పూర్తిగా ప్ర‌జ‌ల‌కు చూపించాలి. పోడియం ఎక్కి నిర‌స‌న తెల‌పడం అంటే గ‌ర్భ‌గుడిలో నిర‌స‌న తెలిపిన‌ట్టే. ఈ సంఘ‌ట‌న‌లు నాకు కంటిపై నిదుర లేకుండా చేశాయి. చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన ప‌రిస్థితి ఇది అంటూ వెంకయ్య ఆవేద‌న చెందారు.

ఈ ప‌రిస్థితుల్లోనూ స‌భ‌ను న‌డ‌ప‌లేనంటూ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కూ రాజ్య‌స‌భ‌ను వాయిదా వేశారు మంగ‌ళ‌వారం రైతుల స‌మ‌స్య‌ను ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తాయి. ఈ అంశంపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మయంలో కొంద‌రు స‌భ్యులు న‌ల్ల‌ని వ‌స్త్రాలు ఊపుతూ, ప‌త్రాలు విసిరేస్తూ నిర‌స‌న‌లు తెలిపారు. చాలా మంది ఎంపీలు స‌భ‌పాతి స్థానానికి దిగువ‌న కూర్చొని టేబుళ్లు ఎక్కారు. గంట‌న్న‌ర సేపు అలానే బైటాయించారు. కొంద‌రు ప్ర‌భుత్వ వ్య‌తిరేఖ విదానానికి నినాదాలు చేశారు. ఇవ‌న్ని వెంక‌య్య‌ని చాలా బాధించాయి