వెంకటరెడ్డి నీది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ ఢిల్లీలో క్లాస్ పీకిన అధిష్టానం.. పీసీసీ క్లారిటీ
Tech Desk-2 - December 25, 2020 / 12:32 PM IST

తెలంగాణ రాష్ట్రంలో చావు బతుకుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోయడం.. ఊపిరి తీయడం అనేది రెండు కూడా ఆ పార్టీ అధినాయకత్వం చేతిలో ఉంది. ఈ సమయంలో సమర్థవంతమైన, నాయకులందరికి ఆమోదయోగ్యమైన కార్యకర్తలు కోరుకునే టీ పీసీసీ చీప్ ను ఎంపిక చేసినట్లయితేనే పార్టీకి తిరిగి ఉత్తేజం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయం ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు పార్టీ అధినాయకత్వం నుండి పిలుపు వచ్చిందా లేదంటే ఆయనే పీసీసీ పదవి కోసం వెళ్తున్నాడా అంటూ చర్చ జరుగుతోంది.

tpcc revanth reddy confirm and congress leaders class for komatireddy venkat reddy
కాంగ్రెస్ పార్టీకి ఈ సమయంలో రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలా కాదని మరెవ్వరికి ఇచ్చినా కూడా పార్టీ మరింత కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ ఇప్పటికే ఎక్కువ జిల్లాల అధ్యక్షులు చెప్పారు. జిల్లాల అధ్యక్షుల మాట ప్రకారం రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. నాకు పదవి ఇవ్వరా అంటూ అధినాయకత్వం వద్ద పంచాయితే పెట్టాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కొందరు రేవంత్ రెడ్డి అభిమానులు కోమటిరెడ్డి తీరును తప్పుబడుతున్నారు.
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలను పక్క పక్కన ఉంచిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పాపులారిటీ ఉన్న నాయకుడు ఎవరు అంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి అనడంలో సందేహం లేదు. కోమటిరెడ్డి గురించి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కనీసం తెలియను కూడా తెలియదు. అయినా కూడా ఆయన కాన్ఫిడెన్స్ తో పీసీసీ చీఫ్ పదవి కోసం పోరాటం చేయడ విడ్డూరంగా ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి పీసీసీ పీఠం కావాలంటూ డిమాండ్ చేసిన కోమటిరెడ్డికి అధిష్టానం క్లాస్ పీకిందని.. రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వబోతున్నాం కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉండాలంటూ సూచించారట. పీసీసీ ఇవ్వకుంటే కోమటిరెడ్డి పార్టీలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. మరి అప్పుడు పరిస్థితి ఏంటీ అనేది చూడాలి.