మూడో మ్యాచ్ మనదే..! అదరగొట్టిన టీమిండియా

Admin - December 2, 2020 / 06:17 PM IST

మూడో మ్యాచ్ మనదే..! అదరగొట్టిన టీమిండియా

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇండియా గెలిచింది. మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన కోహ్లీ సేన ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో సక్సెస్ సాధించి పరువు నిలబెట్టుకుంది. ప్రత్యర్థికి మనోళ్లు 303 పరుగుల టార్గెట్ ఇవ్వగా వాళ్లు చివరికంటూ పోరాడి త`టిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఇండియాకి ఓదార్పు విజయం దక్కినట్లయింది. టాప్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా టీంలో హార్దిక్ పాండ్య 92 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత జడేజా 66, కెప్టెన్ కోహ్లీ 63 రన్లు చేశారు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఆతిథ్య జట్టు ఒక దశలో ఈ మ్యాచ్ ని కూడా కైవసం చేసుకుంటుందేమో అనిపించింది.

ఆస్ట్రేలియా జట్టులో ఆరోన్ ఫించ్ 75, మ్యాక్స్ వెల్ 59 పరుగులు చేశారు. వరుసగా సెంచరీలు చేస్తున్న స్టీవ్ స్మిత్ 7 రన్నుల వద్దే ఔట్ కావటం, దీంతో స్కోరు 56కి చేరుకునే సరికే రెండు వికెట్లు పడటం వల్ల మనోళ్లు ఊపిరి పీల్చుకున్నారు. చిచ్చర పిడుగు అయిన మ్యాక్స్ వెల్ క్రీజులు నిలదొక్కుకున్నాక బ్యాటు ఝుళిపించటం మొదలుపెట్టాడు. సిక్సర్లతో కోహ్లీ సేనను ఆందోళనకు గురిచేశాడు. జట్టు స్కోరును 264/6 దాకా లాక్కొచ్చాడు. ఈ ఈక్వేషన్ ని బట్టి చూస్తే ఆస్ట్రేలియా గెలవటం పెద్ద కష్టమేమీ కాదనిపించింది.

అయితే.. విజయం దిశగా దూసుకెళుతున్న మ్యాక్స్ వెల్-ఏస్టన్ ఆగర్ జోడీని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయటం మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చింది. మరో మూడు బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా ఆతిథ్య జట్టు ఆలౌట్ అయింది. దీంతో మూడు వన్డేల టోర్నీలో మనకు క్లీన్ స్వీప్ తప్పింది. వన్డే సిరీస్ 2-1 తేడాతో ముగియగా ఇక ఈ రెండు జట్లు టీ20 సిరీస్ లో తలపడనున్నాయి. ఇందులో మొదటి మ్యాచ్ ఈ నెల 4 తేదీన కాన్ బెర్రా స్టేడియంలోనే జరగనుంది.

Read Today's Latest National in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us