Jayaprada : జయప్రద.. ఇప్పుడెందుకు గుర్తుకొస్తోంది?..

Jayaprada: సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నాయకుడు ఆజంఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లక్నోలోని మేదాంత ఆస్పత్రి వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆయన ప్రస్తుతం ఆక్సీజన్ సపోర్ట్ తో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఆజంఖాన్ కి జరగరానిదేదైనా జరిగితే ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన అక్కడ ఎంపీ కాబట్టి. అయితే.. ఆజంఖాన్ పేరు చెప్పగానే సినీ నటి జయప్రద పేరు గుర్తుకొస్తుంది. కారణం.. వీళ్లద్దరి మధ్య పదేళ్లకు పైగా పొలిటికల్ గొడవలు ఉండటం. దీనికితోడు రాంపూర్ సెగ్మెంట్ లో బైఎలక్షన్ జరిగితే జయప్రద మళ్లీ పోటీ చేసే ఛాన్స్ ఉన్నాయి. 2019 ఎలక్షన్ లో ఆమె ఆజంఖాన్ చేతిలోనే ఓడిపోయారు. కాబట్టి మళ్లీ బరిలోకి దిగొచ్చని అంటున్నారు.

Jayaprada

నగ్నంగా ఉన్న ఫొటోలు..

జయప్రద తొలిసారి (1994లో) రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజ్యసభ ఎంపీ అయ్యారు. తర్వాత సమాజ్ వాదీ పార్టీలోకి వెళ్లారు. 2004 సాధారణ ఎన్నికల్లో ఎస్పీ తరఫున రాంపూర్ లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ములాయంసింగ్ యాదవ్, అమర్ సింగ్ ఆ పార్టీని నడిపేవారు. 2009 జనరల్ ఎలక్షన్ నాటికి ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ కి, జయప్రదకి మధ్య విభేదాలు తలెత్తాయి. తన నగ్న ఫొటోలను అతను అందరికీ పంపిణీ చేస్తున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆజంఖాన్ ని పార్టీ నుంచి తొలగించారు.

Jayaprada

అండర్ వేర్ రంగు ఖాకీ..

అనంతర పరిణామాల్లో అమర్ సింగ్ కి, ములాయంసింగ్ యాదవ్ కి మధ్య కూడా గొడవలు జరిగాయి. అమర్ సింగ్ ని సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయనకి మద్దతు తెలిపినందుకు జయప్రదకు కూడా అదే అనుభవం ఎదురైంది. 2011లో అమర్ సింగ్, జయప్రద రాష్ట్రీయ లోక్ మంచ్ అనే పార్టీ పెట్టినా నిలబడలేకపోయారు. 2014 లోక్ సభ ఎన్నికల ముందు ఆర్ఎల్డీ పార్టీలో చేరారు. ఆ ఎలక్షన్ లో జయప్రద బిజ్నూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 సాధారణ ఎన్నికల ముందు జయప్రద బీజేపీలోకి జంప్ చేశారు. మళ్లీ రాంపూర్ నుంచి బరిలో నిలిచారు. ఆమె ప్రత్యర్థి ఆజంఖాన్. ఆ ఎలక్షన్ ప్రచారంలో అతను  వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ అభ్యర్థి (జయప్రద) అండర్ వేర్ కలర్ ఖాకీ రంగు అంటూ ఆజంఖాన్ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేయటంతో ఈసీ స్పందించి అతను 3 రోజులు ఎలక్షన్ ప్రచారం చేయటానికి వీల్లేదంది. ఈ ఎన్నికల్లో ఆజంఖానే గెలవటం గమనార్హం.