Crime: తండ్రి పెదాల‌ను తాడుతో కుట్టి ప‌ట్టాల‌పై ప‌డేసిన కుమారుడు

Crime: మ‌నుషుల‌లో రోజురోజుకు మాన‌వ‌త్వం చ‌చ్చిపోతుంది. కన్న‌త‌ల్లిదండ్రుల‌నే క‌నిక‌రం లేకుండా వారిని ఎంత‌గా హింసిస్తున్నారో మ‌నం చూస్తేనే ఉన్నాం. కొంద‌రు క‌నీసం ముద్ద అన్నం కూడా పెట్ట‌కుండా నరకం చూపిస్తుంటారు. ఆ మ‌ధ్య ఓ దుర్మార్గుడు త‌న త‌ల్లిని కొన్ని సంవ‌త్స‌రాలుగా చైనుతో బంధించారు. ఈ సంఘ‌ట‌న అంద‌రిని ఎంత‌గానో బాధించింది. ఇక తాజాగా జార్ఖండ్‌ రాష్ట్రంలో వెలుగు చూసిన అమానుష ఘటన ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు తెప్పిస్తుంది.

Crime

పాలము జిల్లాలోని అంటారి రోడ్ బ్లాక్‌లోని భీతిహర గ్రామంలో భోలా రామ్ అనే వృద్ధుడి మొదటి భార్య చనిపోగా 2010లో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సవతి తండ్రిపై రెండో భార్య కొడుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు. దీంతో మంగ‌ళ‌వారం రాత్రి 65 ఏళ్ల వృద్ధుడిపై కన్న‌కుమారుడు దాడి చేశాడు.మూత్ర విస‌ర్జ‌న‌కు వెళ్లిన స‌మ‌యంలో కుమారుడు అత‌ని స్నేహితులు బోలా రామ్ పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్లను రైల్వే ట్రాక్‌పై ప‌డేశారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు రైల్వే ట్రాక్‌ నుంచి వృద్ధుడిని రక్షించారు. రాత్రి 11 గంటల సమయంలో భోలా రామ్‌ను రైల్వే ట్రాక్‌తో కట్టేసి వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోగా ఉద‌యాన్నే అత‌డిని గ్రామస్తులు చూశారు. అదృష్టం ఏమిటంటే అప్ప‌టి వ‌ర‌కు ఏ రైలు కూడా ఆ ట్రాక్‌పై రాలేదు. పోలీసులు వృద్ధుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వృద్ధుడి పెదాలను కలిపి కుట్టుడానికి ఉపయోగించిన తాడును వైద్యులు తొలగించారు.

Crime

ప్రస్తుతం వృద్ధుడు క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే కుమారుడి చేసిన దాష్టీక‌పు పనిలో రెండో భార్య హ‌స్తం కూడా ఉంద‌ని పోలీసులు అన్నారు. ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేసి నిందితుల‌ని అరెస్ట్ చేశామ‌ని పోలీసులు తెలిపారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో నెటిజ‌న్స్ భార్య‌తో పాటు కుమారుడిపై మండిప‌డుతున్నారు.