Snake: రెండు గంటల పాటు చిన్నారి మెడ ద‌గ్గ‌ర పాము.. వెళ్తూ ఏం చేసిందో తెలుసా?

Snake: పాముని చూస్తే పెద్దోళ్లే భ‌య‌ప‌డతారు.అలాంటిది పిల్ల‌ల‌కు ఎంత భ‌యంగా ఉంటుంది. ఓ పాము చిన్నారి మెడ ద‌గ్గ‌ర రెండు గంట‌ల పాటు తిష్ట‌వేసింది. అక్క‌డ చాలా మంది ఉన్నా కూడా ఏం చేయ‌లేని ప‌రిస్థితి. చివ‌రికి పోతూ పోతూ చిన్నారిని కాటేసి వెళ్లింది. అయితే వెంట‌నే ఆ చిన్నారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డంతో పాప క్షేమంగానే ఉంది.

Snake Crawled Girls Bed While she was Asleep
Snake Crawled Girls Bed While she was Asleep

మహారాష్ట్రలోని వార్దా తాలూకా బోర్ఖేడి-కాలా గ్రామంలో దారుణం వెలుగు చూసింది. ఇంట్లోకి చొరబడిన పాము.. చిన్నారిని కాటు వేసింది. ప్రస్తుతం చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బోర్ఖేడీ-కాలా గ్రామానికి చెందిన గడ్కరీ కుటుంబం.. రోజూలాగే రాత్రి భోజనం తరువాత నిద్రపోయారు. పూర్వ గడ్కరీ(6) తన తల్లితో కలిసి నిద్రపోయింది. అర్థరాత్రి 12 గంటల సమయంలో పూర్వ తల్లికి ఏదో తట్టినట్లు అనిపించింది. వెంటనే లేచిన ఆమె.. పామును గమనించి పక్కకు వెళ్లింది.

అయితే, పూర్వ అక్కడే ఉండిపోయింది. పాము పూర్వపక్కనే పడగ విప్పి కూర్చుంది. అయితే పూర్వ త‌ల్లి సమీపంలో పామును గమనించి పక్కకు వెళ్లి చుట్టుపక్కల వారిని పిలిచింది.అయిన వారు ఏం చేయ‌లేక‌పోయారు. రెండు గంటలపాటు పాము చిన్నారి వద్దే ఉంది. పూర్వ కూడా మెలకువగానే ఉంది. అయితే ఏ మాత్రం కదిలినా పాము కాటు వేసే ప్రమాదం ఉండటంతో ఆమె అలానే పడుకుని ఉంది.

పాము సుమారు రెండు గంటలపాటు చిన్నారి పూర్వ వద్దే ఉంది. అయితే భయంతో చాలాసేపటి తర్వాత బాలిక కొద్దిగా కదిలేసరికి… పాము ఆమె చెయ్యిపై కాటేసి పారిపోయింది. పాము బయటకు వెళ్లగానే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని సేవాగ్రామ్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.