Sachin: బ్యాట్ ప‌ట్టిన చేత్తో, గ‌రిటె ప‌ట్టిన స‌చిన్‌.. ఎందుకిలా?

Sachin: భార‌త క్రికెట్ దిగ్గ‌జం, బ్రాడ్ మ‌న్ త‌ర్వాత అంత‌టి పేరు ప్రఖ్యాత‌లు పొందిన క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌గా అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న స‌చిన్ ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌ల‌ను గెలిపించాడు. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా మారిన లెఫ్ట్ హ్యాండర్… క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగులు, వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు, హాఫ్ సెంచరీలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లెక్కలు… ఇలా ప్రతిదానిలోనూ టాప్‌లో ఉన్నాడు.

Sachin

క్రికెట్ దేవుడిగా కీర్తించ‌బ‌డుతున్న స‌చిన్ చాన్నాళ్ల క్రితం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. క్రికెట్ ద్వారా అభిమానుల‌ని అల‌రించ‌లేక‌పోయిన కూడా సోష‌ల్ మీడియాలో వెరైటీ పోస్ట్‌ల‌తో మంచి వినోదం అందిస్తున్నారు. తాజాగా ఆయ‌న కిచెన్‌లోకి దూరి స‌రికొత్త వంట‌కం చేసి దానిని గెస్ చేయ‌మ‌ని నెటిజ‌న్స్‌ని అడిగాడు.

తన ఆత్మీయుల కోసం వంట చేసే సచిన్ మరోసారి కిచెన్ లో దూరి సరదాగా కామెంటరీ కూడా ఇస్తూ వంటకం రెడీ చేశాడు. అయితే త‌ను వండేది ఏంటో త‌న‌కు కూడా తెలియ‌ద‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అంతేకాదు ఇక ఈ వంటకాన్ని చేస్తూనే తన క్రికెట్ టెక్నిక్ ని కూడా వంటకంలో ఉపయోగించాను అంటూ కామెంట్రీ ఇచ్చాడు సచిన్ టెండూల్కర్. ఎవ‌రి కోసం ఈ వంట‌కం చేస్తున్నాడో మాత్రం చెప్ప‌లేదు సచిన్.

ఇటీవ‌ల క‌రోనా నుండి కోలుకున్న స‌చిన్ ఇంటికే ఎక్కువ‌గా ప‌రిమితం అయ్యాడు. కుటుంబ స‌బ్యుల‌తో టైం స్పెంట్ చేస్తూ, మ‌రోవైపు త‌న స‌హ‌చ‌ర క్రికెట‌ర్స్ యువ‌రాజ్ సింగ్, అజిత్ అగార్క‌ర్‌తో క‌లిసి గోల్ఫ్ ఆడుతూ విలువైన స‌మ‌యాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సోష‌ల్ మీడియాలో స‌చిన్ చేసే పోస్ట్‌ల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

గ‌తంలో త‌న తల్లి, భార్య అంజలి, కూతురు సారాల కోసం వంటింట్లోకి వెళ్లి… తన చేత్తో స్వయంగా వంట చేశాడు. త‌న త‌ల్లికి ఇష్టమైన బైగాన్ బర్తాని స్వ‌యంగా వండి త‌ల్లిని ఆనందింప‌జేశాడు. ఏదేమైన బ్యాట్ ప‌ట్టిన చేతుల‌తో గ‌రిటె ప‌ట్టి ఆత్మీయుల‌ని అల‌రిస్తున్న స‌చిన్‌ని నువ్వు గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.