Punjab: : విద్యుత్ వ‌ద్దు, ఎంఎల్ఏ కావాలంటూ మ‌హిళ వింత కోరిక‌

Punjab: ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్నాయంటే పార్టీలు మానిఫెస్టో ప్ర‌క‌టిస్తూ వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం ఖాయం. విద్యుత్ ఉచితంగా ఇస్తామ‌ని, లేదంటే రుణాలు మాఫీ చేస్తామ‌ని, ఇళ్లు క‌ట్టిస్తామ‌ని ఇలా ర‌క‌రాలల వ‌రాలు కుప్పిస్తుంటారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. తన అధికారాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు గ‌ట్టిగానే కృషి చేస్తుంది. ప్ర‌స్తుతం పంజాబ్‌లో త‌మ పార్టీని విస్తృతం చేయాల‌ని, త్వరలో ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది.

Punjab

ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్ లో విజయం సాధించి.. అధికారాన్ని చేపడితే.. తాము ఆ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ప్రవేశ పెడతామని ప్రకటించారు. దీనికి ఓ మ‌హిళ స్పందించిన తీరు అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. ‘నాకు ఉచిత విద్యుద్ వద్దు. రాఘవ్ కావాలి’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీలో అత్యంత పిన్న వయస్కుడైన‌ ఎమ్మెల్యే కమ్ అందగాడైన రాఘవ్ చద్దా గురించి త‌న ట్వీట్‌లో పేర్కొంది.

మ‌హిళ చేసిన ట్వీట్ వైర‌ల్ కాగా, దీనిపై తన స్పందన తెలియ‌జేశాడు. పార్టీ మేనిఫెస్టోలో నేను లేను. ఉచిత విద్యుత్ మాత్రమే ఉంది. కావాలంటే పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చాక మీ ఇంటికి ఉచితంగా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేట్లు చూస్తాలే’ అని బదులిచ్చారు. రాఘవ్ రిప్లై తర్వాత సదరు యువతి తన ట్వీట్ ను ట్విటర్ నుంచి తొలగించింది. ఈ వ్య‌వ‌హారం అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

32 ఏళ్ల రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరింత దూకుడ్ని ప్రదర్శించి అధికారాన్ని సొంతం చేసుకోవాలన్నది కేజ్రీవాల్ లక్ష్యం అని అంటున్నారు.