Narendra Modi : 75 ఏళ్ల‌లో ఎన్నో ఒడిదుడుకులు.. ఓట‌మిని ఏనాడు అంగీక‌రించ‌లేద‌న్న మోదీ

NQ Staff - August 15, 2022 / 01:10 PM IST

Narendra Modi : 75 ఏళ్ల‌లో ఎన్నో ఒడిదుడుకులు.. ఓట‌మిని ఏనాడు అంగీక‌రించ‌లేద‌న్న మోదీ

Narendra Modi : దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌ధాని మోదీ ఈ రోజు ఉద‌యం ఎర్ర‌కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకం ఎగురు వేశారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు . కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్‌ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అని ఆయ‌న అన్నారు.

Prime Minister Narendra Modi Speech

Prime Minister Narendra Modi Speech

సేవ చేయ‌డ‌మే ల‌క్ష్యం..

త్యాగధనుల పోరాటల ఫలితమే మన స్వాతంత్రం. మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలన పునాదిని కదిలించిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. మాతృ భూమి కోసమే అల్లూరి సీతారామరాజు జీవించారు. గిరిజనలు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు.

75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది.భారతదేశం తన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తనకు అమూల్యమైన సామర్థ్యం ఉందని నిరూపించుకుంది. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో, ఆశలు, ఆకాంక్షలు, ఎత్తులు, కనిష్ఠాల మధ్య అందరి కృషితో మేము చేయగలిగిన చోటికి చేరుకున్నాము.

2014లో, పౌరులు నాకు బాధ్యత ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన నాకు.. ఎర్రకోట నుండి ఈ దేశ పౌరులను ప్రశంసించే మొదటి వ్యక్తిగా ఓ అవకాశాన్ని ఇచ్చారు. పేదవాళ్లకు సాయం అందించడమే నా లక్ష్యం. ఇప్పుడు నవసంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్‌ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ప్రజలంతా నిలదొక్కుకోవడమే ఆత్మ నిర్బర్‌ లక్ష్యం అని ఆయ‌న అన్నారు. జై జైవాన్‌, జై కిసాన్‌, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్ కూడా ఉంది అని స్ప‌ష్టం చేశారు. ప్రధాని మోదీలో తొమ్మిదవ సారి నరేంద్ర మోదీ పతాకాన్ని ఆవిష్కరించారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us