PM Narendra Modi : ఉచితం.. అనుచితం.! రాజకీయ సంకటం.!

NQ Staff - August 11, 2022 / 10:45 PM IST

PM Narendra Modi : ఉచితం.. అనుచితం.! రాజకీయ సంకటం.!

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోడీ, సంక్షేమ పథకాల పేరుతో ‘ఉచిత’ రాజకీయాలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. సంక్షేమానికి అర్థమే మారిపోయింది ఇటీవలి కాలంలో. పేదవాడ్ని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందే. కానీ, ఈ క్రమంలో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతిని నాశనం చేస్తే ఎలా.?

సర్వోన్నత న్యాయస్థానంలో కూడా సంక్షేమ పథకాల పేరుతో రాజకీయ పార్టీలు ఎన్నికల హామీల ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంపై కేసు నడుస్తోంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించాలని ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఉచితం.. వారికి హ్యాపీ.. వీళ్ళకి బీపీ.!

PM Narendra Modi Serious Mistake In welfare Schemes

PM Narendra Modi Serious Mistake In welfare Schemes

ట్యాక్స్ పేయర్లు కడుతున్న సొమ్ములు ఏమైపోతున్నాయ్.? పేదోడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరి, సంక్షేమ పథకాలు అందని మధ్యతరగతికి ప్రభుత్వాలు ఏం సాయం చేస్తున్నాయ్.? తమకు ప్రభుత్వాల వల్ల వీసమెత్తు లాభం లేనప్పుడు, ప్రభుత్వాలకు ఎందుకు పన్నులు కట్టలి.? అని ట్యాక్స్ పేయర్లు చెబుతున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకు డబ్బులుంటున్నాయ్.. కానీ, రోడ్లెయ్యడానికీ, కరెంటుకీ నిధులు వుండటంలేదు. అభివృద్ధి అటకెక్కినా, సంక్షేమం మాత్రం కొనసాగుతోంది. ఇది దేశానికే అత్యంత ప్రమాదకరమైన విషయం. దేశ ప్రజల భవిష్యత్తుతో ఆటలాడే సంక్షేమం.. అస్సలేమాత్రం సమర్థనీయం కాదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

Read Today's Latest National in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us