India : షాపింగ్.. షాపింగ్.! ఆ విషయం లోనూ భారత్‌దే అగ్రస్థానం.!

NQ Staff - October 15, 2022 / 04:40 PM IST

India : షాపింగ్.. షాపింగ్.! ఆ విషయం లోనూ భారత్‌దే అగ్రస్థానం.!

India : పండగొచ్చిందంటే చాలు షాపింగ్ చేయాల్సిందే. పండగ సీజన్‌లో షాపింగ్ చేస్తే ఆ కిక్కే వేరప్పా. ఇది భారత్ లెక్క. కానీ, అమెరికా, యూరప్ దేశాలు ఆర్ధికంగా బాగా వెనకబడి వున్నాయని ఓ సర్వే ద్వారా వెల్లడయ్యింది. అధిక వడ్డీ రేట్లు, ధరల పెరుగుదలను తట్టుకోలేక అక్కడి వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించేశారట.

కానీ, భారత్‌లో మాత్రం అలాంటి ఛాయలేమీ కనిపించడం లేదని తాజా సర్వేలో తేలింది. దేశంలోని ఏ ప్రధాన నగరాలు తీసుకున్నా రిటైల్ షాపులూ, షోరూమ్ కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్నాయి. వరుస పండగలే ఇందుకు ప్రధాన కారణంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఫెస్టివల్స్ మోడ్..

పండగొచ్చిందంటే చాలు కొత్త బట్టలు కొనాల్సిందే. అలాగే పలు రకాల గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులూ, కొత్త కార్లు, నూతన గృహాలు.. ఇలా వాట్ నాట్.. అన్ని రకాలుగానూ కొనుగోళ్లు విసృతంగా పెరగాయట భారత్‌లో. దాంతో అమ్మకాల రేటు ఎంత లేదన్నా 2.2 లక్షల కోట్లు దాటిపోతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయ్.

కోవిడ్ కారణంగా అమ్మకాలు, కోనుగోళ్లు దాదాపు రెండేళ్లుగా దారుణంగా పడిపోయాయ్. కానీ, ఈ ఏడాది మళ్లీ అన్ని రకాలా వినియోగదారులు పెరిగారనీ, తదనుగుణంగా ఆయా కంపెనీలు ఆఫర్ చేస్తున్న స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్లూ కొనుగోళ్ల జోష్‌ని పెంచుతున్నాయంటున్నారు.

అంతేకాదు, బ్యాంకులూ, ఎన్‌బీఎఫ్‌సిల నుంచి సులభంగా రుణాల లభ్యత.. పట్టణ ప్రాంతాల్లో పెరిగిన వుద్యోగావకాశాలు తదితర అంశాలు భారత్‌లో ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడడానికి కారణాలుగా చెబుతున్నారు. ఆఫ్ లైన్‌తో పాటూ, ఆన్ లైన్ వినియోగాలు కూడా బాగా ఊపందుకున్నాయ్. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్యాండమిక్ కారణంగా ఆర్ధిక మాంద్యం వచ్చినా, పెరిగిన అమ్మకాలూ, కొనుగోళ్ల కారణంగా ఈ ఏడాది భారత్‌పై దాని ప్రభావం పెద్దగా వుండదనే అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. అమెరికా సహా యూరప్ దేశాలు ఆర్ధిక మాంధ్యాన్ని భరిస్తున్నా, వినియోగ ఖర్చుల ఊపుతో భారత్ మాత్రం 2022 – 2023 ఆర్ధిక సంవత్సరంలో ప్రపంచంలో మరే ఇతర దేశానికి లేనంతగా భారత్, ఆరు శాతం అధిక వృద్ధి రేటు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా.

Read Today's Latest National in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us