Nitish Kumar : మోడీకి వ్యతిరేకంగా నితీష్.! ప్రధాని పీఠంపై కన్నేశారే.!

NQ Staff - August 12, 2022 / 10:10 PM IST

Nitish Kumar : మోడీకి వ్యతిరేకంగా నితీష్.! ప్రధాని పీఠంపై కన్నేశారే.!

Nitish Kumar : ప్రధాని నరేంద్ర మోడీ, వచ్చే ఎన్నికల్లో ఇంకోసారి అధికారం దక్కించుకోవడం అంత తేలిక కాదట.! ఈ విషయాన్ని మోడీ మాజీ మిత్రుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెబుతున్నారు. ‘వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీ అధికార పీఠమెక్కడం చాలా చాలా కష్టం..’ అంటోన్న నితీష్ కుమార్, తెరవెనుకాల విపక్షాల్ని ఏకం చేసే బాధ్యతను తీసుకుంటున్నారట.

ఈ విషయమై నితీష్ కుమార్‌ని ఓ మీడియా సంస్థ ప్రశ్నిస్తే, ‘నాకైతే, ప్రధాని పీఠమెక్కాలన్న ఆలోచన లేదు. నా విషయంలో నా శ్రేయోభిలాషులెవరైనా ఎక్కువ అభిమానంతో అలాంటి వ్యాఖ్యలు చేస్తే, వాటికి నేను బాధ్యుడిని కాను..’ అంటూ నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.

అందరూ.. ఆయన్నే ముందుకు తోస్తున్నారెందుకు.?

Nitish Kumar Wants Become Prime Minister

Nitish Kumar Wants Become Prime Minister

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కీ క్లీన్ చిట్ వుంది. అందుకే, జేడీయూ నేత అయిన నితీస్ కుమార్, ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. అంతిమంగా ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు. గతంలో బీజేపీ కూటమితోనూ, ఇప్పుడు ఆర్జేడీ కూటమితోనూ.. ఆయనే లాభపడ్డారు.. పదవి పరంగా. దటీజ్ నితీష్ కుమార్.

నిన్న మొన్నటిదాకా ప్రధాని పదవిపై మమతా బెనర్జీ కన్నేసినట్లు ప్రచారం జరిగింది. ప్రధాని పదవి రేసులో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావునీ తీసుకొచ్చారు గులాబీ నాయకులు కొందరు. అయితే, జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం ఇంకా ఏర్పాటు కానే లేదు.

ఇదిలా వుంటే, నితీష్ విషయమై వివిధ రాజకీయ పార్టీలో సానుకూల వ్యక్తమవుతోంది. సో, ఆయన గనుక ప్రధాని రేసులో నిలబడితే, పోటీ ఒకింత రసవత్తరంగా సాగే అవకాశాల్లేకపోలేదు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us