Nithin Gadkari: యూట్యూబ్ ద్వారా ప్ర‌తి నెల రూ. 4ల‌క్ష‌లు సంపాదిస్తున్న‌కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

Nithin Gadkari: డిజిట‌ల్ యుగంలో టెక్నాల‌జీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీనిని క్యాష్ చేసుకొని ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు. వెరైటీ వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్‌ల‌లో షేర్ చేయ‌డం ద్వారా లాభాలు బాగానే వ‌స్తున్నాయి.

Nithin Gadkari Earns 4 Lakhs Per Month from Youtube
Nithin Gadkari Earns 4 Lakhs Per Month from Youtube

క‌రోనా, లాక్‌డౌన్ స‌మ‌యంలో చాలా మంది ఇంటికే ప‌రిమితం కావ‌డంతో యూట్యూబ్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఇంట్లో ఉండి ల‌క్ష‌లు ఆర్జించిన‌ట్టు తెలిపారు.గుజరాత్‌లోని భరూచ్‌లో దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే పనుల పురోగతిపై సమీక్షించిన సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంట్లోఉన్న నేను రెండు ప‌నులు చేశాను. చెఫ్‌గా మారి ఇంట్లో వంట చేశానని, అలాగే, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపాన్యాసాలు ఇచ్చినట్టు చెప్పారు. విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, తదితరులకు ఆన్‌లైన్‌లో దాదాపు 950కి పైగా ఉపన్యాసాలు ఇచ్చినట్టు తెలిపారు. వాటన్నింటినీ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశానన్నారు.

నా ఉపాన్యాసాల‌ని చాలా మంది యూట్యూబ్ ఛానెల్‌లో చూడ‌డంతో వ్యూస్ పెరిగి నెల‌కు రూ.4లక్షలు చొప్పున రాయల్టీగా చెల్లిస్తోందని వివరించారు. మరోవైపు, రహదారి నిర్మాణ కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లకు తమ మంత్రిత్వశాఖ రేటింగ్‌ను ప్రారంభిస్తుందన్నారు.