Marriage: ఇద్ద‌రు ఉన్న‌త స్థాయి ఉద్యోగుల పెళ్లి ఖ‌ర్చు కేవ‌లం రూ. 500

Marriage: ఇప్ప‌ట్లో పెళ్లంటే ఎంత సంద‌డి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారం ముందు నుండే నానా హంగామా ఉంటుంది. మెహందీ వేడుక‌, హ‌ల్దీ వేడుక ఇలా ప‌లు రకాల ఫంక్ష‌న్ జ‌రుపుకుంటారు. ఆ త‌ర్వాత పెళ్లి అనంత‌రం రిసెప్ష‌న్ ఉంటుంది. ఈ రిసెప్ష‌న్ కూడా ఒక‌సారి ఫ్యామిలీ ఇంకోసారి ఫ్రెండ్స్‌కి అని చేస్తుంటారు. ఖ‌ర్చుకు ఏ మాత్రం వెన‌కాడ‌కుండా అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లిళ్లు జ‌రుపుకుంటున్న ఈ సమ‌యంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కేవ‌లం ఐదు వంద‌ల రూపాయ‌ల ఖ‌ర్చుతో త‌మ పెళ్లి తంతు ముగించారు.

Marriage

వ‌రుడు, వ‌ధువు ఉన్న‌త స్థాయి ఉద్యోగులైతే వారికి డబ్బుకు కొద‌వ ఏముంది. అట్ట‌హాసంగా తమ పెళ్లి వేడుక జ‌రిపించుకోవ‌చ్చు. కాని వారు సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. వివాహానికి విపరీతంగా ఖర్చులు పెడుతున్న సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ ధార్‌ జిల్లాలో.. ఓ ఆర్మీ మేజర్‌ , సిటీ మెజిస్ట్రేట్‌లు నిరాడంబ‌రంగా పెళ్లి త‌తంగాన్ని ముగించారు.

ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకొని అంద‌రికి షాక్ ఇచ్చారు ఉన్న‌త స్థాయి ఉద్యోగులు. ఐదు వంద‌ల రూపాయ‌ల‌తో దండ‌లు, స్వీట్స్ కొనుక్కొని పెళ్లి తంతు ముగించారు. వధువు శివంగి జోషి ధార్ నగర మెజిస్ట్రేట్ కాగా, వరుడు అంకిత్‌ చతుర్వేది భారత సైన్యంలో మేజర్‌గా లడఖ్‌లో పని చేస్తున్నారు.

భోపాల్‌కి చెందిన వీరిద్ద‌రికి రెండు సంవ‌త్స‌రాల క్రితం పెళ్లి ఫిక్స్ అయింది. మేజ‌ర్ అంకిత్ చ‌తుర్వేది ల‌డ‌ఖ్‌లో పని చేస్తుండగా, శివంగి ధార్ జిల్లాలో సిటి మెజిస్ట్రేట్‌గా ప‌ని చేస్తున్న నేప‌థ్యంలో కొద్ది రోజులుగా వాళ్లు క‌రోనా క‌ట్ట‌డి కోసం ప‌ని చేస్తున్నారు. దీని వ‌ల‌న వివాహ తేది ప‌డుతూ వ‌స్తుంది. ఈ క్ర‌మంలో వారు రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకొని అంద‌రికి షాక్ ఇచ్చారు.

Marriage

శివంగి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఇంకా పూర్తిగా అంతమవలేదని, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని అన్నారు. “వివాహానికి విపరీతంగా ఖర్చు చేయడం మాకు నచ్చలేదని, అందుకే మేమే ఇలా చేసుకున్నట్లు” ఆమె తెలిపారు. ఏదేమైన స‌ముద్రాల‌లో, ఆకాశాల‌లో భారీ ఖ‌ర్చుల‌తో పెళ్లి చేసుకుంటున్న ఈ స‌మ‌యంలో ఇద్ద‌రు ఉన్న‌త ఉద్యోగులు రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోవడం అంద‌రికి షాక్ ఇస్తుంది. వీరు చాలా మందికి ఆద‌ర్శంగా నిలుస్తార‌న‌డంలో సందేహం లేదు.