ఏటీఏం పిన్ మర్చిపోయారా..? డోంట్ వర్రీ..ఒక్క కాల్‌తో ఆల్ సెట్

Samsthi 2210 - December 4, 2020 / 07:21 PM IST

ఏటీఏం పిన్ మర్చిపోయారా..? డోంట్ వర్రీ..ఒక్క కాల్‌తో ఆల్ సెట్

ఉరుకుల పరుగులు జీవితం..లైఫ్ అంతా పాస‌వార్డ్స్ మయం అయిపోయింది. ఫోన్, ల్యాప్ ట్యాప్, ట్యాబ్ అన్నింటికి పాస్ వర్డ్స్ ఉండాల్సిందే. ఇక లెక్కకు మించిన బ్యాంకు అకౌంటులు. ఈ క్రమంలో ఎన్నో ఏటీఎంలు ఉంటాయి. వాటిని పిన్ నంబర్స్ అన్ని గుర్తు పెట్టుకోవడం కష్టమే. ఏటీఎం పిన్ మర్చిపోవడం సహజంగా జరిగేదే. యూపీఐలు, ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తూ..రెండు మూడు నెలలు ఏటీఎం వాడకపోతే పిన్ మర్చిపోతాం. మెమరీ పవర్ ఎక్కువగా ఉన్నవాళ్లకు, ఎప్పుడూ ఏటీఎం కార్డు వాడేవారికి ఈ సమస్య ఉండదు. వారికి పిన్ ఈజీగా గుర్తుంటుంది. కానీ ఎప్పుడో ఓసారి ఏటీఎం కార్డు వాడేవారు పిన్ మర్చిపోవడం చాలా కామన్ విషయం. రెండుమూడు ఏటీఎం కార్డులు వాడేవారు కూడా పిన్ నంబర్లు గుర్తుపెట్టుకోలేక సతమతమతమవుతూ ఉంటారు. ఈ క్రమంలో కొత్త పిన్ జనరేట్ చేయడం గతంలో కాస్త కష్టమైన టాస్క్ కింద ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో..అది కూడ సులభతరం అయ్యింది.

మీ ఏటీఎం, ఐవీఆర్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ద్వారా ఈజీగా ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ పిన్ పేరుతో పబ్లిసిటీ చేస్తోంది. ఎస్‌బీఐ వినియోగదారులు ఈజీగా పిన్ జనరేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సులభతరమైన పద్దుతుల్లో ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. మీరు ఎస్‌బీఐ వినియోగదారులు అయితే ఐవీఆర్ సిస్టమ్ ద్వారా ఏటీఎం పిన్ పొందడానికి ఈ స్టెప్స్ అనుసరించండి. ఎస్‌బీఐ కస్టమర్లు ఐవీఆర్ పద్దతి ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయడానికి 1800 112 211 లేదా 1800 425 3800 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చెయ్యాలి. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ల నుంచే కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటీఎం డెబిట్ కార్డు సేవల కోసం 2 నొక్కాలి. ఆ తర్వాత పిన్ జనరేషన్ కోసం 1 నొక్కాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసినట్టైతే 1 నొక్కాలి. లేదా ఏజెంట్‌తో మాట్లాడటానికి 2 నొక్కాలి.

అనంతరం మీ ఏటీఎం కార్డులోని చివరి 5 అంకెల్ని అడుగుతుంది..వాటిని నొక్కాలి. మీరు ఎంటర్ చేసిన ఐదు అంకెల్ని నిర్ధారించేందుకు 1 నొక్కాలి. ఏటీఎం కార్డులోని చివరి ఐదు అంకెల్ని తిరిగి ఎంటర్ చేసేందుకు 2 నొక్కాలి. ఇక మీ బ్యాంక్ ఖాతా నంబర్ లోని చివరి 5 అంకెల్ని ఎంటర్ చేయాలి. నిర్ధారించేందుకు 1 ప్రెస్ చేయాలి. రీ ఎంటర్ చేసేందుకు 2 నొక్కాలి. ఆ తర్వాత మీ బర్త్ డేట్ ఎంటర్ చేయాలి. మీ గ్రీన్ పిన్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన గ్రీన్ పిన్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్.ఎం.ఎస్ చేయబడుతుంది. కాగా మీ ఏటీఎం పిన్ సహా ఇతర వివరాలు కావాలని బ్యాంకు నుంచి ఎవరూ కాల్స్ గానీ మెసేజులు గానీ చెయ్యరు. గుర్తుంచుకోండి.

Read Today's Latest National in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us