ముక్కులో ఉండిపోయిన‌ కాయిన్… 53 ఏళ్ల తర్వాత బయటకు తీసిన వైద్యులు

Samsthi 2210 - November 28, 2020 / 08:05 PM IST

ముక్కులో ఉండిపోయిన‌ కాయిన్… 53 ఏళ్ల తర్వాత బయటకు తీసిన వైద్యులు

చిన్న పిల్లలకు రూపాయి, రెండు రూపాయల బిళ్లలు లేదా ఇతర కాయిన్స్ ఏవైనా ఇస్తే..వాటితో కాసేపు ఆడుకుని..మింగిసే వాళ్లు. ఇలాంటి ఘటనలు చాలా చూశాం. అది గొంతులో ఇరుక్కోకుండా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అయితే ముక్కుల్లో కాయిన్స్ పెట్టుకున్న సందర్భాలు అరుదనే చెప్పాలి. అయితే ఒక వ్యక్తి తన చిన్నతనంలో కాయిన్‌ని ముక్కులో పెట్టుకున్నాడు. అప్పట్నుంచి అతడి ముక్కులోనే ఉండిపోయింది..రోజులు, నెలలు కూడా కాదు..సంవత్సరాలు. అది కూడా 53 సంవత్సరాలు అంటే మీరు అవాక్కవ్వడం ఖాయం. ఆ ఇంట్రస్టింగ్ స్టోరీ ఏంటో చదివేద్దాం పదండి.

coin

రష్యాలోని జెలెనోగ్రాడ్‌‌కు చెందిన 59 ఏళ్ల వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. సదరు వ్యక్తి 6 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కుడి వైపు ముక్కు రంథ్రంలోకి చిన్న కాయిన్ ప్రమాదవశాత్తూ పెట్టుకున్నాడు. అయితే, అప్పట్లో దాని వల్ల అతడికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. దీంతో ఆ విషయమే పట్టించుకోవడమే మానేశాడు. అయితే, కొన్నాళ్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నా.. ట్రాన్సిల్స్ అనుకుని లైట్ తీసుకున్నాడు. ఇటీవల పరిస్థితి మరింత దారుణంగా మారడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు…. సిటీ స్కాన్‌లో అతడి ముక్కులో ఏదో వస్తువు ఉన్నట్లు నిర్ధారించారు. అది పూర్తిగా అతడి కుడివైపు ముక్కు రంథ్రాన్ని మూసివేయడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందింగా మారింది.

ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్లు రిపోర్టులను చూపించి ముక్కులో ఏదో వస్తువు ఉందని వివరించాడు. దీంతో బాధితుడికి తన చిన్నప్పటి ఘటన గుర్తొచ్చింది. బాల్యంలో ఆడుకుంటున్నప్పుడు కాయిన్ ముక్కులో పెట్టుకున్నానని, ఆ తర్వాత ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, అది ఇదే అవ్వొచ్చని డాక్టర్లకు చెప్పాడు. దీంతో డాక్టర్లు ఎండోస్కోపిక్ ఆపరేషన్ చేసి.. సుమారు 1.5 గంటలు శ్రమించి ఆ నాణెన్ని బయటకు తీశారు. అయితే అది లోహపు నాణెం కావడం వల్ల తుప్పు పట్టేసింది. చాలా ఏళ్లుగా ముక్కులోనే ఉండటంతో దాని పై భాగంలో కొంత తుక్కుతుక్కైంది. సర్జరీలో భాగంగా అతడి ముక్క రంథ్రాన్ని సైతం కరెక్ట్ చేశారు. ఫ్యూచర్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా చికిత్స అందించారు. దీంతో బాధితుడు ఇప్పుడు ఊపిరి ప్రశాంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు.

Read Today's Latest National in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us